ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 23, 2020 , 00:53:06

ఘనంగా కుమ్రంభీం జయంతి

ఘనంగా కుమ్రంభీం జయంతి

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం జయంతిని జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ గెస్ట్‌ హౌస్‌లో గురువారం సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించారు. భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేశ్‌, రాష్ట్ర కార్యదర్శి  సత్యం, రీజియన్‌ కార్యదర్శి దూట లింగస్వా మి, నాయకులు సుధమల్ల దామోదర్‌, హనుమండ్ల సతీశ్‌, మేరు గు నరేందర్‌, మాడుగుల సురేందర్‌ పాల్గొన్నారు.

జన్నారం : కుమ్రంభీం జయంతి సందర్భంగా మురిమడు గు గ్రామ చౌరస్తాలోని భీం విగ్రహానికి విశ్వబ్రాహ్మణ పరి రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి జలంధర్‌చారి, జిల్లా అధ్యక్షు డు శ్రీరాముల గంగాధర్‌చారి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఇందులో మండల విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సం ఘం సభ్యులు పాల్గొన్నారు.