శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 23, 2020 , 00:53:09

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

మంచిర్యాల అగ్రికల్చర్‌ : నియోజక వర్గ పరిధిలో 88 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తన ఇంట్లో గురువారం అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజ య్య, కౌన్సిలర్లు గాదె సత్యం, సిరికొండ కొండాల్‌ రావు, చుంచు శ్రీని వాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

దండేపల్లి : పాత మామిడిపెల్లి గ్రామానికి చెందిన బియ్యాల అజయ్‌కు రూ.50 వేలు, ధనిశెట్టి శంకరయ్యకు రూ.21 వేలు, రెబ్బెన్‌పెల్లి గ్రామానికి చెందిన ముత్యం శంకరయ్యకు రూ.21 వేలు, కొండ మౌనికకు రూ.18 వేల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే దివాకర్‌రావు అందజేశారు. టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్‌, బం డారి వెంకటేశ్‌, నాయకులు గాండ్ల నరేశ్‌, బత్తుల శేఖర్‌, ఎల్తపు శేఖర్‌, తదితరులు ఉన్నారు.

బెల్లంపల్లిటౌన్‌ : క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాసిపేట మండలం లంబాడీతండాకు చెందిన కిరణ్‌కుమార్‌కు రూ. 56వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేశారు.