సోమవారం 30 నవంబర్ 2020
Mancherial - Oct 22, 2020 , 01:25:35

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

  • ఎమ్మెల్యే దివాకర్‌రావు 

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ రూ.10 లక్షలతో పట్టణంలోని రాంనగర్‌లో పార్కు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పార్కులో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మా ణం, వాచ్‌మన్‌ గది నిర్మాణం, వివిధ రకాల మొక్కల పెం పకం, తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

బతుకమ్మ వేడుకలకు రాళ్ల వాగు వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాయంత్రం రాళ్లవాగు వంతెనపై పట్టణ ప్రగతి నిధులతో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ట్రిప్‌ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, కౌన్సిలర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, కౌన్సిలర్లు బొలిశెట్టి సునీత, హరికృష్ణ, సంజీవ్‌, బానేశ్‌, ప్రకాశ్‌నాయక్‌, నాయకులు భూమేశ్‌, బింగి రమేశ్‌, అప్పాసు కిషన్‌, చంద్రశేఖర్‌ హండే, బొలిశెట్టి కిషన్‌, తూముల నరేశ్‌, దుర్గం రాజేశ్‌, గౌసొద్దీన్‌, నగేశ్‌ పాల్గొన్నారు.