సోమవారం 30 నవంబర్ 2020
Mancherial - Oct 22, 2020 , 01:25:39

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్స్‌ సేవలు ప్రారంభం

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్స్‌ సేవలు ప్రారంభం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యుడు నడిపెల్లి దివాకర్‌ రావు ఇచ్చిన ఫాస్ట్‌ రెస్పాండ్‌ (అత్యవసర ప్రతిస్పందన) అంబులెన్స్‌ను బుధవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో కలెక్టర్‌ భారతీ హోళికేరితో కలిసి ఎమ్మెల్యే దివాకర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్స్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్‌ రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ అత్తి సరోజ, పీఏసీఎస్‌ చైర్మన్‌ సందెల వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వసుంధర, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, జీవీకే ఈఎంఆర్‌ఐ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

చెన్నూర్‌ టౌన్‌ : కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అందించిన 108 వాహనాన్ని బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అర్చనా గిల్డా జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ ప్రస్తుతం కోటపల్లి, చెన్నూర్‌ (మండలం, పట్టణం), భీమారం, జైపూర్‌ మండలాల ప్రజలకు సేవలందిస్తుందని తెలిపారు. త్వరలో మరో వాహనం రానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, జడ్పీటీసీ తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు, జైపూర్‌ ఎంపీపీ రమాదేవి, టీఆర్‌ఎస్‌ చెన్నూర్‌ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలాల్‌ గిల్డా, నాయిని సతీశ్‌ రాజ్‌, మేడ సురేశ్‌ రెడ్డి, ఆరిఫ్‌, వెంకటనర్సయ్య, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.