బుధవారం 20 జనవరి 2021
Mancherial - Oct 22, 2020 , 01:25:35

ఇందారం ఓసీ ప్రారంభం

ఇందారం ఓసీ ప్రారంభం

  • ఏటా 12 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
  • అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితోనే ఆరు నెలల్లో ఓపెన్‌
  • బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్‌ (పీపీ) బలరాం

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం ఓపెన్‌ కాస్టులో బొగ్గు ఉత్పత్తిని బుధవారం సింగరేణి డైరెక్టర్‌ (పీపీ) బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. యేటా 12 లక్షల టన్నుల జీ-9 గ్రేడ్‌ బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, డోజర్ల ద్వారా తరలింపు చేస్తామని తెలిపారు. టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, సీఎండీ శ్రీధర్‌ సారథ్యంలో కంపెనీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, లాభాల్లో ఉపరితల గనులే ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.   

 - జైపూర్‌ 

  ఇందారం ఓసీ గని ద్వారా ఏడాదికి 12 లక్షల టన్నుల జీ 9 గ్రేడ్‌ బొగ్గు ఉత్పత్తి చేస్తామని సింగరేణి డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌) బలరాం అన్నారు. శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఇందారం ఓపెన్‌కాస్టులో బుధవారం కొబ్బరికాయ కొట్టి బొగ్గు వెలికితీత  పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి పూజ చేసిన ఎనిమిది నెలల్లోనే బొగ్గు ఉత్పత్తికి కృషి చేసి 12 ఏళ్ల కలను అధికారులు నెరవేర్చారన్నా రు.

సీఎం కేసీఆర్‌, సింగరేణి సీఎండీ శ్రీధర్‌ సారథ్యంలో సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నట్లు తెలిపారు. దీని ఏర్పాటుకు సహకరించిన భూనిర్వాసితులు, విప్‌ బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి బొగ్గును లారీల ద్వారా శ్రీరాంపూర్‌ సీహెచ్‌పీకి అక్కడి నుంచి జైపూర్‌ విద్యుత్‌ కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు. అనంతరం టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కంపెనీ లాభాల్లో ఉపరితల గనులే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అనంతరం స్థానిక అధికారులు డైరెక్టర్‌, ఇతర అధికారులు, టీబీజీకేఎస్‌ నాయకులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జీఏం ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ సత్తయ్య, శ్రీరాంపూర్‌ జీఎం లక్ష్మీనారాయణ, ఎస్వోటూ డైరెక్టర్‌ రమేశ్‌రావు, వెంకటేశ్వర్‌రెడ్డి సీఎంవోఐ ఉపాధ్యక్షుడు,  ఓసీ పీవో రాజేశ్వర్‌రెడ్డి, మేనేజర్లు ఉమాకాంత్‌, శ్రీధర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ వెంకట్‌రావు, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo