బుధవారం 02 డిసెంబర్ 2020
Mancherial - Oct 21, 2020 , 02:12:04

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు

చెన్నూర్‌ టౌన్‌ :  చెన్నూర్‌ పట్టణం ప్రగతి పథంలో పయనిస్తున్నది. దాదాపు రూ.11 కోట్లతో పట్టణంలోని జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి ఐబీ చౌరస్తా వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అర్చన గిల్డా, వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, కమిషనర్‌ రమేశ్‌, నాయకులు రాం లాల్‌ గిల్డా మంగళవారం ప్రారంభించారు. కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, ఏఈ సాయి, పార్టీ నాయకులు పాల్గొన్నా రు. రోడ్డు 132 ఫీట్ల వెడల్పు చేయాల్సి ఉండగా, అయ్యప్ప ఆలయం గర్భగుడికి నష్టం వాటిల్లవద్దని, 120 ఫీట్లకు కు దించి పనులు ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆదేశించారు. దీంతో రోడ్డుకిరువైపులా 60 ఫీట్ల చొప్పున 120 ఫీట్ల వెడల్పుతో విస్తరణ పనులు చేపట్టనున్నారు. అనంతరం సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. 

ఒక్కొక్క సమస్య పరిష్కారం..

పట్టణంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పూర్తి కావస్తున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న చెన్నూర్‌ 2018 ఆగస్టులో మున్సిపాలిటీగా మారింది. అప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వ విప్‌, ఎ మ్మెల్యే బాల్క సుమన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో చర్చించి మున్సిపల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. పట్టణ సుందరీకరణే ప్రధానంగా ఏకంగా రూ.49.25 కోట్ల నిధులు మంజూరు చే యించారు. మినీ స్టేడియం, డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద చెరువు, కుమ్మరి కుంట చెరువుల ను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనుల ప్రణాళికలు చేశా రు. పలుచోట్ల డ్రైనేజీ పనులు షురూ చేశారు.

ఇటీవల సమీక్షించిన విప్‌..

పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ గత శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

50 ఏళ్లకు అనువుగా ఉండేలా..

పట్టణ అభివృద్ధి, జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా రానున్న 50 ఏళ్లకు అనువుగా రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ఉండాలని బాల్క సుమన్‌ సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్కలు, మిషన్‌ భగీరథ పైపులైన్లు, నాలాలు, విద్యుత్‌ స్తంభాలు, వాటర్‌ ఫౌంటెయిన్లు  ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇరుకైన రోడ్లతో ఇబ్బందులు..

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో పట్టణ ప్రజ లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్‌ చౌక్‌ నుంచి ఐబీ వరకు ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ కార్యాలయా లు, పాఠశాలలు, దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా తహసీల్‌, పోలీస్‌ స్టేషన్‌, మున్సిపల్‌ కార్యాలయాలు, మార్కెట్‌ ఆఫీస్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల, మసీద్‌ ఉండ డం, వాటికి వచ్చే ప్రజలు అధిక సంఖ్యలో వస్తుండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతున్నది. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న చెన్నూర్‌ మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం, గత పాలకులు పట్టించుకోకపోవడంతో రోడ్డు వెడల్పు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. కొత్త మున్సిపాలిటీపై విప్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అధికారుల పనితీరుతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి.