ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 21, 2020 , 02:12:09

సాహితీ వేదిక ప్రోత్సాహ గీతిక

సాహితీ వేదిక ప్రోత్సాహ గీతిక

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రధాన కారణం కవులు, కళాకారులు, రచయితలు. వారు రాసిన కవితలు, రచనలు సమాజంలో మార్పునకు నాంది పలికాయి. కళాకారులు ఆలపించిన గేయాలు తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వారికి ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ పథకాల ప్రచార బాధ్యతలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించారు.  

ఏజెన్సీ కేంద్రంగా ప్రారంభం.. 

చాలా మంది కవులు, కళాకారులు ప్రతిభ ఉండి, చేయూత లేక వెలుగులోకి రావడం లేదు. పెద్ద పెద్ద పట్టణాలతోపాటు ఏజెన్సీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలోని కవులు, కళాకారులను బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు.. కవిత్వంపై విద్యార్థులు ఆసక్తి కల్పించేందుకు ఏర్పడ్డదే ఉట్నూర్‌ సాహితీ వేదిక. ఉట్నూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు గోపగాని రవీందర్‌, మెస్రం మనోహర్‌లు 2014లో ఉట్నూర్‌ సాహితీ వేదికను ప్రారంభించారు. అనతికాలంలోనే ఏజెన్సీలో అక్కడక్కడ ఉన్న కవులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వందలాది మందిని తయారు చేసింది. చిన్నచిన్న కవితలు రాసే స్థాయి నుంచి పుస్తకాలు, పత్రికలకు సంపాదకీయాలు రాసే స్థాయికి ఉట్నూర్‌ సాహితీ వేదిక చేరింది.

కవులు రచించిన పుస్తకాలు..

ఉట్నూర్‌ సాహితీ వేదిక పలువురి రచనలను వెలుగులోకి తెచ్చింది. ఇందులో ప్రధానంగా అంకురం, చిగురు, చెరగని సంతకం, నేలమ్మా.. నేలమ్మా గేయ రూప కవిత్వం, ఉట్నూర్‌ సాహితీ సంచిక, ఉట్నూర్‌ కవిత, జ్ఞానేశ్వర శతకం, విద్యా కుసుమాలు, దూరమెంతైనా, కథాంతరంగం, కైతికాల దండారి, బతుకు చిత్రం రచనలు. ఈ 

సాహితీ వేదిక ప్రోత్సాహ గీతిక


కవులు.. కవిత్వాలు.. కళాకారులు..  వీరంతా ఒకప్పుడు పట్టణాలకే పరిమితమయ్యేవారు. నేడు ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో సైతం కనబడుతున్నారు. ఏకంగా జాతీయస్థాయిలో రాణిస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏజెన్సీలో మట్టిలో మాణిక్యాలు అక్కడక్కడ ఉండగా.. వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది మాత్రం ఉట్నూర్‌ సాహితీ వేదిక. ఇందులో సంవత్సరాల కృషి దాగి ఉంది. ఒక్క పుస్తకం రచించేందుకు తంటాలు పడ్డ కవులు నేడు పదుల సంఖ్యలో రాసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సహకారం అందిస్తున్న ఉట్నూర్‌ సాహితీ వేదికపై కథనం..   - ఉట్నూర్‌

పుస్తకాలు ఏజెన్సీ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు. ఈ ప్రాంతంలోని జీవన విధానం, పండుగలు, రైతుల బాధలు, జాతర్లను గురించిన విశేషాలను తమ రచనల్లో కవులు పొందుపర్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని పుస్తక ఆవిష్కరణకు కవులు కసరత్తు చేస్తున్నారు.

విద్యార్థి దశ నుంచే.. 

కవులు, కళాకారులను ప్రోత్సహించడంలో ఉట్నూర్‌ సాహితీ వేదిక ముందున్నది. కవులుగా తయారు చేసేందుకు విద్యార్థి దశను ఎంపిక చేసుకున్నది. దీంతో పట్టణంలోని కళాశాలలు, పాఠశాలల్లో కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. సాహితీ ప్రముఖుల జయంతులను నిర్వహిస్తూ విద్యార్థులు కవులు, కళాకారులయ్యేందుకు ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో చాలా మంది ఉద్యోగులు ఉండడంతో గతంలో ప్రతినెలలో మొదటి ఆదివారం ‘నా రచనలు, కవి సమ్మేళనం’ పేరిట మండలంలోని ఉట్నూర్‌, నాగాపూర్‌, ఎక్స్‌రోడ్‌, లాల్‌టెకిడి, లక్షెటిపేట్‌ గ్రామాలతోపాటు ఇతర చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సహకరిస్తున్న కవులు..

ఉట్నూర్‌ సాహితీ వేదికకు చాలా మంది సహకరిస్తున్నారు. వీరు రచించిన రచనలతోపాటు ఇతరులను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు గోపగాని రవీందర్‌, మెస్రం మనోహర్‌తోపాటు అధ్యక్షుడు కొండగొర్ల లక్ష్మయ్య, సభ్యులు కట్ట లక్ష్మణాచారి, రాథోడ్‌ భీంరావు, మర్సకోల తిరుపతి, మర్సకోల సరస్వతి, జాదవ్‌ బంకట్‌లాల్‌, వినోద్‌కుమార్‌, ఆత్రం మోతీరాం, ముంజం జ్ఞానేశ్వర్‌, రాథోడ్‌ శ్రావణ్‌,  జాదవ్‌ ఇందల్‌సింగ్‌, సురేశ్‌తోపాటు చాలా మంది కళాకారులు, కవులు ఉన్నారు. వీరు రచించిన కైతికాలకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డులు అందాయి.