బుధవారం 25 నవంబర్ 2020
Mancherial - Oct 21, 2020 , 09:14:21

ఇసుక రీచ్‌

ఇసుక రీచ్‌

  • ఆన్‌లైన్‌ బుకింగ్‌తో ఇంటికే శ్యాండ్‌
  • నెలకు 2వేలకు పైగా ట్రిప్పులు సరఫరా
  • దూరాన్ని బట్టి రూ.1400 నుంచి రూ.3500 వరకు ధర
  • నిత్యం వందలాది మంది కూలీలు, ట్రాక్టర్ల యజమానులకు ఉపాధి

నెన్నెల : ‘మన ఇసుక వాహనం’ పాలసీతో సర్కారుకు భారీగా ఆదాయం రావడంతో పాటు ట్రాక్టర్‌ యజమానులు, వందలాది మంది కూలీలకు నిత్యం ఉపాధి దొరుకుతున్నది. ఇసుక కావాల్సిన వారు ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకుంటే చాలు వెంటనే ఇంటికి వచ్చి చేరుతుంది. గతంలో బడా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకునేవారు. మరి కొందరు అధిక ధరలకు విక్రయించి వినియోగదారుల వద్ద అందినకాడికి దండుకునేవారు. ప్రభుత్వానికి నయా పైసా ఆదాయం వచ్చేది కాదు. ప్రస్తుతం తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ వల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతున్నది. ఇసుక సీనరేజ్‌తో పాటు, డీఎంఎఫ్‌టీ, సేల్స్‌ టాక్స్‌ సంబంధిత గ్రామాలు, పట్టణాలకు కొంతమేర నిధులు సమకూరుతున్నాయి. ఇసుక రీచ్‌లతో ట్రాక్టర్‌ యజమా నులతో పాటు కూలీలు నిత్యం ఉపాధి పొందుతున్నారు.

మన ఇసుక వాహనం రిజిస్ట్రేషన్‌..

ఇసుకను తరలించడానికి ట్రాక్టర్ల యాజమానులు వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, బ్యాంక్‌ఖాతా, సెల్‌నంబర్‌, వాహన పొల్యూషన్‌, రోడ్డు టాక్స్‌, ఇన్సూరెన్సు కలిగి ఉండాలి. వాటితో పాటు మైనింగ్‌ కార్యాలయంలో రూ.8 వేలు డిపాజి ట్‌ చేయాలి. అప్పుడు ఆ వాహనాన్ని ఇసుక రీచ్‌కు అటాచ్‌ చేస్తారు. రిజిస్ర్టేషన్‌ అయిన వాహనానికి ఇసుక బుకింగ్‌ను బట్టి ఇసుక తరలించడానికి మెస్సేజ్‌లు వస్తుంటాయి. దాని ఆధారంగా ఇసుకను సంబంధిత రీచ్‌ నుంచి తరలించాలి. 

ఆన్‌లైన్‌లో బుకింగ్‌..

ఇసుక కావాల్సిన వారు ఇంటిలో నుంచే మొబైల్‌ ద్వారా ‘మన ఇసుక వాహనం’ యాప్‌లో కావాల్సిన ట్రిప్పులను బుక్‌ చేసుకోవచ్చు. బుక్‌ చేసుకునే ముందు సెల్‌ నంబర్‌, అడ్రస్‌ అందించాలి. బుక్‌ చేసిన ఇసుకను నింపుకొని అక్కడే ఉన్న ఎస్‌ఆర్‌ వద్ద పికప్‌ కొట్టాలి. ఆ తర్వాత బుక్‌ చేసిన అడ్రస్‌కు వెళ్లి అన్‌లోడ్‌ చేస్తారు. 

ఖర్జీ ఇసుక రీచ్‌ నుంచి..

ఖర్జీ ఇసుక రీచ్‌ నుంచి బెల్లంపల్లి నియెజకవర్గంలోని కాసి పేట, తాండూర్‌, బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాలకు ఇసుకను తరలించడానికి అనుమతి ఉంది. కిలోమీటర్‌ను బట్టి ఇసుకకు ధర నిర్ణయించారు. ట్రాక్టర్‌ ట్రిప్పుకు రీచ్‌ నుంచి బెల్లంపల్లి కి రూ.2700 ధర ఉంది. దూరాన్నిబట్టి రూ.1400 నుంచి రూ.3500 వరకు ధర ఉంది. నిత్యం ఇక్కడి నుంచి 60 నుంచి 70 ట్రిప్పుల ఇసుకను తరలిస్తుంటారు. నెలకు కనీసం 2వేలకుపైగా ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుకను తరలిస్తుంటారు. దీనివల్ల ప్రభుత్వానికి ట్రిప్పుకు రూ.370 వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఇసుక సీనరేజ్‌, డీఎంఎఫ్‌టీ, సేల్స్‌టాక్స్‌, ఎస్సెమ్మెస్‌లు, గ్రామాల వాటా తదితర శాఖలకు నిధులు వెళ్తుంటాయి. నెలకు కనీసం రూ.7.40 లక్షలు ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నది.