శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Oct 18, 2020 , 02:46:17

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

మంచిర్యాల కల్చరల్‌ :  దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక దుర్గా మందిర్‌, ఏసీసీతో పాటు పలు చోట్ల దుర్గాదేవి విగ్రహాలను మండపాలకు తరలించి పూజలు నిర్వహించారు.  

మంచిర్యాల అగ్రికల్చర్‌ (హాజీపూర్‌) : హాజీపూర్‌ మండలంలో ప్రత్యేకంగా అలకంరించిన మండపాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించారు.  భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

సీసీసీ నస్పూర్‌ :  నస్పూర్‌ మున్సిపాలిటీలోని  న్యూ నాగార్జున కాలనీ శ్రీవిజయ కనకదుర్గ భక్త మండలి యూత్‌ ఆధ్వర్యంలో ఏడోసారి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భక్త మండలి గౌరవాధ్యక్షుడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, అధ్యక్షుడు తిప్పని లింగమూర్తి, ఉపాధ్యక్షుడు, విగ్రహదాత కందుల వేణు, ప్రధాన కార్యదర్శులు దార వంశీకృష్ణ, మల్లికార్జున్‌, ఉప ప్రధాన కార్యదర్శులు ముత్యం వెంకటస్వామి, ఉప్పు రాజ్‌కుమార్‌, సభ్యులు పోతన సతీశ్‌ కుమార్‌, చిరంజీవి, కమిటీ సలహాదారులు పెట్టం శ్రీనివాస్‌, పాదం నర్సయ్య, మహిళా సభ్యులు రేవతి, లావణ్య, తిరుమల, వరసిద్ధి గణేశ్‌ మండలి కమిటీ సభ్యులు సదానందం, రామ్మూర్తి, రామస్వామి పాల్గొన్నారు.  

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌) : శ్రీరాంపూర్‌ ఏరియాలోని గనులు, కార్మికుల కాలనీల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రీరాంపూర్‌ ఓసీపీపై మైసమ్మ దేవాలయంలో మేనేజర్‌ జనార్దన్‌ దంపతులు పూజలు చేశారు. పీవో పురుషోత్తంరెడ్డి, క్వాలిటీ రీజియన్‌ జీఎం అల్లి రాజేశ్వర్‌, డీవైజీఎం నూక రమేశ్‌, పిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆర్‌కే-6గనిపై మైసమ్మ దేవాలయంలో మేనేజర్‌ సంతోష్‌కుమార్‌ దంపతులు, రీజియన్‌  జీఎం శ్రీనివాసరావు, జీఎం కే లక్ష్మీనారాయణ  పూజలు చేశారు. ఆర్‌కే న్యూటెక్‌పై మేనేజర్‌ స్వామిరాజ్‌, ఆర్‌కే 8పై ఇన్‌చార్జి మేనేజర్‌ హరికిషన్‌, ఆర్‌కే-7గనిపై మైసమ్మ దేవాలయం లో ఏజెంట్‌ రఘుకుమార్‌, మేనేజర్‌ గోసిక మల్లేశం, పిట్‌ కార్యదర్శి మెండ వెంకటి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. ఆర్‌కే 8కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌లో దుర్గామాత విగ్రహాలను శోభాయాత్రగా మండపాలకు తరలించారు. మాజీ సర్పంచ్‌ మల్లెత్తుల రాజేంద్రపాణి, యువశక్తి యూత్‌ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ పూదరి కుమార్‌ పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ బండి పద్మ, సీనియర్‌ పీవో శ్యాంకుమార్‌, టీబీజీకేఎస్‌ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్‌ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, ఎం శ్రీనివాస్‌, ఉత్సవ కమిటి సభ్యులు అనిల్‌, కృష్ణ, రాజు, తిరుపతి, రవి పాల్గొన్నారు. 

బెల్లంపల్లి టౌన్‌ : పట్టణంలోని కన్నాల శివారులోని బంగారు మైసమ్మ దేవాలయంలో ఆలయ అధ్యక్షుడు గెల్లి రాజలింగు దంపతుల ఆధ్వర్యంలో దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభించారు. ఈనెల 21న చండీ యాగం నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాసవీ దేవాలయంలో మొదటి రోజు పూజారి వేదం రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని 21వ వార్డు బూడిదగడ్డ బస్తీ వాటర్‌ట్యాంకు ఏరియాలో దుర్గామాత మండపంలో కౌన్సిలర్‌ రాజనాల కమల పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావ ణ్‌, నాయకులు బడికెల రమేశ్‌, బడికెల లక్ష్మణ్‌, నాగుల రాంచందర్‌, దుర్గం రాములు, ఎం మల్లేశ్‌, సీహెచ్‌ రామస్వామి, పీ లక్ష్మయ్య, టీ శంకర్‌, మహిళలు పాల్గొన్నారు.

కాసిపేట : సోమగూడెం భరత్‌ కాలనీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, కాసిపేట తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠిం చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. 

నెన్నెల: దేవీ శరన్నవరాత్రులు మండలంలో ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా మండపాలకు తరలించారు. మహాగౌరి రూపంలో కొలిచారు.  

తాండూర్‌ : మండల కేంద్రంతో పాటు, అచ్చలాపూర్‌, రేచిని, మాదారం టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాసిపేట, మాదారం త్రీ ఇైంక్లెన్‌లో దుర్గాదేవి విగ్ర హాలను మండపాలకు తరలించి ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు  శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి ని అలంకరించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. 

దండేపల్లి: మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు భక్తులు ప్రత్యేక  పూజలు నిర్వహించారు.  మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. 

చెన్నూర్‌ టౌన్‌ : పట్టణంలోని  కాపువాడ, ప్రతాప మారు తి హనుమాన్‌ మందిరంలో దుర్గాదేవి విగ్రహాలను ఏర్పా టు చేశారు. 9వ వార్డులో భక్తులు కోలాటాలు, నృత్యాల మధ్య శోభాయాత్రగా అమ్మవారి విగ్రహాన్ని మండపానికి తరలించారు. కౌన్సిలర్‌ దోమకొండ అనిల్‌ కుమార్‌, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


logo