గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Oct 18, 2020 , 02:43:29

నేడు చెన్నూర్‌లో మెగా రక్తదాన శిబిరం

నేడు చెన్నూర్‌లో మెగా రక్తదాన శిబిరం

చెన్నూర్‌ టౌన్‌ : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్న ట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. తలసేమియా, సికిల్‌సెల్‌ బాధితుల సహాయార్థం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణు లు జిల్లాలోనే అతిపెద్ద మెగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకల్లో పాల్గొని, విప్‌ సుమన్‌కు శుభాకాంక్షలు తెలుపాలని కోరారు. 

చెన్నూర్‌ రూరల్‌ : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించనున్న రక్తదాన శిబిరం ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం పరిశీలించారు. అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీలో టీఆర్‌ఎస్‌ రూరల్‌ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరాన్ని ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌ రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రత్న సమ్మిరెడ్డి, దవాఖాన సిబ్బంది జగదీశ్‌, కార్యకర్తలు పరిశీలించారు.


logo