శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Oct 16, 2020 , 02:14:18

నిర్మాణాలను వేగవంతం చేయాలి

నిర్మాణాలను వేగవంతం చేయాలి

  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి 

కన్నెపల్లి(భీమిని) :  నిర్మాణాలను వేగవంతం చేయాలని మం చిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. భీమినిలోని రైతు వేదిక, డంప్‌ యార్డు, శ్మశాన వాటిక పనులను కలెక్టర్‌ పరిశీలించారు. దీంతోపాటు కన్నెపల్లి, జన్కాపూర్‌ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటిక, డంప్‌ యార్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల ఆఖరు వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్తుల నమోదు ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట డీపీవో నారాయణరావు, ఎంపీడీవో రాధాకృష్ణ, సర్పంచ్‌ కమలాబాయి, ఎంపీవో విజయ ప్రసాద్‌, ఏపీవో భాస్కర్‌రావు, కార్యదర్శి సత్యనారాయణ రాజు, ఉప సర్పంచ్‌ ఓం ప్రకాశ్‌ గుప్తా ఉన్నారు. 


logo