మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Oct 16, 2020 , 02:14:28

ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక

ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక

  •  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌   కనక యాదవ్‌రావు, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా 
  • n  దుబ్బగూడలో బతుకమ్మ చీరెల పంపిణీ

జైనూర్‌ : ఆడబిడ్డలకు పండుగ కానుకగా సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావు, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా అన్నారు. మండలంలోని దుబ్బగూడ  గ్రామంలో  గురువారం  మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల పండుగలకూ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకా లు ఇక్కడ అమలవుతున్నాయన్నారు. అనంతరం గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మడావి భీంరావు ఉన్నారు. logo