శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Oct 15, 2020 , 02:01:36

రైతు వేదికలు సకాలంలో పూర్తి చేయాలి

రైతు వేదికలు సకాలంలో పూర్తి చేయాలి

  • ఎంపీపీ శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య

దండేపల్లి : రైతు వేదికల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య పేర్కొన్నారు. మండలంలోని పెద్దంపేట, మేదరిపేటలో రైతు వేదికల పనుల ను వారు బుధవారం పరిశీలించారు. వేదికలు పూర్తయితే రైతులు సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, ఏవో అంజిత్‌కుమార్‌, ఎంపీటీసీ ముత్తె రాజన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు కొట్టె  సత్తయ్య, శంకర్‌రావు, వేణు ఉన్నారు.

లక్షెట్టిపేట రూరల్‌ : దసరాలోపు రైతు వేదికల పనులు పూర్తి చేయాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. మండలంలోని దౌడేపల్లి, వెంకట్రావుపేట రైతు వేదికల పనులు, పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదిక భవనాలు, వివిధ పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామా ల్లో ఏర్పాటు చేస్తున్న డంప్‌ యార్డుల ను త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్మశాన వాటికల్లో  అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ ఎంపీవో  వెంకటరమణ, ఏఈ పీఆర్‌ శృతి, ఎంపీటీసీ బాతుల సత్త య్య, అంకతి గంగయ్య, శంకరయ్య, టీఏలు రాజన్న, కైవల్య, తదితరులు పాల్గొన్నారు. logo