శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 14, 2020 , 01:46:15

ఆడబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్‌

ఆడబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్‌

 కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌(వాంకిడి) : తెలంగాణలోని  ఆడబిడ్డలకు పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి కొనియాడారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ విమలతో కలిసి మహిళలకు చీరె లు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ రోజున ఆడబిడ్డల ముఖంలో సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చీరెలను కానుకగా అందజేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటు, సర్పంచ్‌ తుకారాం, ఉపసర్పంచ్‌ పవన్‌ సాయి, ఎంపీటీసీలు, నాయకులున్నారు. 

కెరమెరి : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో చీరెలను జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగతో పాటు క్రిస్మస్‌, రంజాన్‌కు సైతం చీరెలు పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, వైస్‌ ఎంపీపీ అబూల్‌ కలాం, ఎంపీడీవో మహేందర్‌, సర్పంచ్‌ బయనబాయి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉత్తం నాయక్‌, నాయకులు షేక్‌ యూనుస్‌, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.