శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Oct 14, 2020 , 01:46:18

ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

  •  ఇన్‌ ఫ్లో 1,30541 క్యూసెక్కులు   n అవుట్‌ ఫ్లో 2,03260 క్యూసెక్కులు

హాజీపూర్‌ : ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో హాజీపూర్‌ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువ కు వదులుతున్నారు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,30,541 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. 2,03860 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి  స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గానూ 147.39 మీటర్లకు చేరుకున్నది. 20.175 టీఎంసీలకు గాను 18.4805 టీఎంసీలుగా ఉంది.