శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Oct 14, 2020 , 01:46:20

రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి

రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి

  •    n తప్పులు లేకుండా  నమోదు చేయాలి
  •    n అధికారులతో కలెక్టర్‌   భారతీ హోళికేరి

జన్నారం : ఈ నెల 15వ తేదీ నాటికి ఆస్తుల వివరాల నమోదు సర్వేను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ భారతీ హోళికేరి, అడిషనల్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మండలంలోని జన్నారం, పొనకల్‌ గ్రామాల్లో పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్న ఆస్తుల వివరాల నమోదు సర్వేను వారు మంగళవారం పరిశీలించారు. ఇంటి యజమాని వివరాలు సమగ్రంగా తెలుసుకొని, తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అరుణారాణి, ఎంపీవో రమేశ్‌తో ఆమె మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వేను పర్యవేక్షించాలని, వేగవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ పుష్పలత ఉన్నారు. 

దండేపల్లి : మండల పరిషత్‌ కార్యాలయంలో ఆస్తుల వివరాల నమోదు సర్వేపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. సర్వేపై ప్రజల సందేహాలను నివృత్తి చేసి, వేగవంతం చేయాలన్నారు. ముత్యంపేటలో రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. గడువులోగా వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో మేఘమాల, సర్పంచ్‌ విఠల్‌, ఎంపీటీసీ ముత్తె రాజన్న, సింగిల్‌ విండో డైరెక్టర్‌ బత్తుల తిరుపతి, సత్తన్న, తదితరులున్నారు.

పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తి చేయాలి

హాజీపూర్‌ : పల్లె ప్రకృతి వనాల పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాదాబైనామా ద్వారా కొన్న భూమిని క్రమబద్ధీకరించుకునేలా ప్రజలకు అవ గాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, చెన్నూర్‌, తాం డూర్‌, బెల్లంపల్లి, హాజీపూర్‌, జన్నారం మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.