శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 12, 2020 , 03:00:06

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయండి

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయండి

  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

హాజీపూర్‌ : జిల్లాలో రైతు వేదికల నిర్మా ణ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారు లు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేం ద్రంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు యాసంగిలో మక్కజొన్న కాకుండా వరి, పెసర, నువ్వు లు, మినుములు, శనగలతోపాటు ఇతర పంటలు సాగు చేసేలా అధికారులు దృష్టి సా రించాలని సూచించారు. రైతు కల్లాల ఏర్పా టు పనులు త్వరగా ప్రారంభించాలని సూ చించారు. ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, బెల్లంపల్లి, భీమిని వ్యవసా య అధికారులు సురేఖ, ఇంతియాజ్‌, ఏవోలు, తదితరులు పాల్గొన్నారు.