మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Oct 12, 2020 , 03:00:03

లాభాల వాటాపై సంబురాలు

లాభాల వాటాపై సంబురాలు

  • సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
  • శ్రీరాంపూర్‌లో పటాకలు కాల్చిన టీబీజీకేఎస్‌ నాయకులు

  • కరోనా సంక్షోభంలోనూ కార్మికులకు కేసీఆర్‌ అండ : గుర్తింపు సంఘం నాయకులు
మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): కార్మికులకు 28 శాతం లాభాల వాటా చెల్లించాలని సీఎం కేసీఆర్‌ సింగరేణి యాజమాన్యానికి ఆ దేశాలు జారీ చేయడంపై శ్రీరాంఫూర్‌ గను లు, ఓసీపీపై కార్మికులు ఆదివారం సంబురా లు చేసుకున్నారు. టీబీజీకేఎస్‌ డిప్యూటీ ప్ర ధాన కార్యదర్శి దీకొండ అన్నయ్య, రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి, పిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్మికులు పటాకలు కాల్చారు. అనంతరం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తితో కష్టాల్లో ఉన్నా హామీ మేరకు వాటా చెల్లించిన కేసీఆర్‌కు కార్మికులు రుణపడి ఉం టారని కార్మికులు పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ ఈ ని ర్ణయంతో ఒక్కో కార్మికుడికి కనీసం రూ. 30 వేల నుంచి రూ. 90 వరకు అందుతాయని వాటా ఇప్పించేందుకు కృషి చేసిన టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మంత్రులకులంతా కృతజ్ఞతలు చెబుతు న్నారన్నారు. టీబీజీకేఎస్‌ సహాయ పిట్‌ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నాయకులు చిన్నయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


logo