గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Oct 11, 2020 , 06:09:03

ఒకే ఒక్కడు వేయి మొక్కలు..

ఒకే ఒక్కడు వేయి మొక్కలు..

  • సీసీసీలో నాటి రికార్డు సృష్టించిన
  • సింగరేణి డైరెక్టర్‌ బలరాం
  • గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా 10 వేలు నాటాలని నిర్ణయం
  • ఇప్పటికే 9 వేలు పూర్తి 
  • ఆదర్శంగా నిలుస్తున్న అధికారి 
  • పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు

ఆయన సింగరేణిలో ఓ ఉన్నతాధికారి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఇచ్చిన గ్రీన్‌ చాలెంజ్‌ పిలుపు మేరకు 10 వేల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 8వేల మొక్కలు పెట్టగా, శనివారం ఒక్క రోజే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1006 మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. మొత్తంగా 9,006 మొక్కలు నాటగా.. రేపో.. మాపో లక్ష్యాన్ని చేరుకోనున్నారు. ఎవరి సాయం లేకుండా సొంతంగా పలుగూపార చేతపట్టి ఉద్యమంలా సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు సింగరేణి సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్‌లు అండ్‌ ప్లానింగ్‌) బలరాం. 

సీసీసీ నస్పూర్‌ : గ్రీన్‌చాలెంజ్‌ భాగంగా సీసీసీ టౌ న్‌షిప్‌లో శనివారం శ్రీరాంపూర్‌ జనరల్‌ మేనేజర్‌ కే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించగా, సింగరేణి సంస్థ డైరెక్టర్‌  (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌) బలరాం అత్యధికంగా మొక్కలు నాటి రికార్డు సృష్టించా రు. టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, గ్రీన్‌ చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, ఏరియా అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు హాజ రై ఒక్కో మొక్క నాటగా, డైరెక్టర్‌ బలరాం పారపట్టుకొని సొంతంగా 1006 మొక్కలు నాటారు. ఇది వరకు శ్రీరాంపూర్‌ ఓసీపీ ఓబీపై ఒకే రోజు 1250 మొక్కలు నాటి ప్రశంసలు అందుకున్న విషయం విదితమే..

పర్యావరణాన్ని కాపాడాలి..

ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సింగరేణి డైరెక్టర్‌ బలరాం అన్నారు.  సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం దివ్యమైన కార్యక్రమమం అని అభివర్ణించారు. వనాల పెంపుతోనే మానవ మనుగడ సాధ్యమని, దానిని గుర్తించే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. అనంతరం శ్రీరాంపూర్‌ జీఎం మాట్లాడుతూ దేశంలో ఏ సివిల్‌ సర్వీస్‌ అధికారి సింగరేణి డైరెక్టర్‌ బలరాం చరిత్ర పుటల్లో నిలిచిపోతారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్వోటూ డైరెక్టర్‌ రమేశ్‌రావు, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్‌రెడ్డి, వీరభద్రయ్య, డీజీఎంలు శివరావు, అమరేందర్‌రెడ్డి, సభ్యులు కిశోర్‌, పూర్ణ, టీబీజీకేఎస్‌ ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్‌, పర్సనల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.  logo