బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Oct 10, 2020 , 01:45:23

కృతజ్ఞత ర్యాలీకి తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు

కృతజ్ఞత ర్యాలీకి తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు

కెరమెరి : నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్‌ కృతజ్ఞత తెలిపేందుకు జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టిన  ర్యాలీకి మండలం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివెళ్లారు. ఎంపీపీ పేందోర్‌ మోతీరాం ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి బైక్‌ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న నూతన చట్టాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ర్యాలీకి వెళ్లిన వారిలో జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, వైస్‌ ఎంపీపీ సయ్యద్‌ అబూల్‌ కలాం, మండల అధ్యక్షుడు రాథోడ్‌ ఉత్తం నాయక్‌, ఎంపీటీసీ సక్కారాం, నాయకులు షేక్‌ యూనుస్‌, తదితరులు ఉన్నారు.  

జైనూర్‌: జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ కోసం జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యు డు ఇంతియాజ్‌లాల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్‌ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్‌, ఎంపీటీసీలు లట్పటె మహదేవ్‌, కుమ్ర భగవంత్‌రావు, జుగాదిరావు, సర్పంచ్‌లు మడావి భీంరావ్‌, మెస్రం పార్వతి, లక్ష్మణ్‌, గోవింద్‌రావ్‌, సిడాం భీంరావ్‌, కుమ్ర శ్యాంరావ్‌, మండల నాయకులు మెస్రం అంబాజీ, అజ్జులాల, షేక్‌ అబ్బు, తదితరులున్నారు. 

రెబ్బెన : ర్యాలీకి రెబ్బెన మండలం నుంచి తరలివెళ్లిన వారిలో  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ వేముర్ల సంతోష్‌, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర సభ్యుడు సంగెం ప్రకాశ్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌, వైస్‌ చైర్మన్‌ రంగు మహేశ్‌, సర్పంచ్‌లు చెన్న సోమశేఖర్‌, బొమ్మినేని అహల్యాదేవి, పోటు సుమలత, శ్రీనివాస్‌, శ్యాంరావు, పోషమల్లు, మల్లేశ్‌, మోర్ల శ్రీనివాస్‌, రైతు బంధు సమితి సభ్యురాలు కుందారపు శంకరమ్మ, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్‌,  వినోద్‌జైస్వాల్‌, బొమ్మినేని శ్రీధర్‌, పందిర్ల మధునయ్య, దుర్గం తిరుపతి, జుమ్మిడి ఆనందరావు, దాగం దామోదర్‌, రవినాయక్‌, శాంతిగౌడ్‌, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావు, మోర్ల నరేందర్‌, కుమ్మరి మల్లేశ్‌, చిలుముల శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo