బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Oct 10, 2020 , 01:45:38

రెవెన్యూకు జై..

రెవెన్యూకు జై..

 కొత్త చట్టానికి కర్షకుల నీరాజనం

400 ట్రాక్టర్లు, 500 బైక్‌లతో భారీ ర్యాలీ

మారుమూల పల్లెల నుంచి తరలివచ్చిన  రైతులు, నాయకులు

 జై కేసీఆర్‌ నినాదాలతో మార్మోగిన వీధులు

పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే సక్కు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఆసిఫాబాద్‌/ ఆసిఫాబాద్‌ టౌన్‌ : ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నూత న రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు, నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ తీశారు. సుమారు 400 ట్రాక్టర్లు, 500 బైక్‌లపై రైతు లు, నాయకులు తరలివచ్చారు. ఆసిఫాబాద్‌లోని ప్రేమలా గార్డెన్‌ నుంచి కుమ్రం భీం చౌరస్తా మీదుగా అంబేద్కర్‌ చౌక్‌, వివేకానంద చౌక్‌, గాంధీ చౌక్‌ మీదు గా మూడు కిలోమీటర్ల వరకు ర్యాలీ సాగింది. జై తెలంగాణ.. జైజై కేసీఆర్‌ నినాదాలతో ప్రధాన వీధులన్నీ మారుమోగాయి. అటవీ, న్యాయ, దేవదాయశాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా పరిషత్‌ వైస్‌ చై ర్మన్‌ కోనేరు కృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌తో కలిసి పాల్గొన్నారు. మంత్రి తో పాటు ముఖ్య నాయకులు ట్రాక్టర్లు నడిపి.. రైతుల్లో మరింత ఉత్సాహం నిం పారు. అనంతరం మంత్రి అల్లోల మాట్లాడుతూ రైతుల గౌరవాన్ని పెంచుతున్న ఏకకై సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. అన్నదాతల కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతోపాటు భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా కొత్తపట్టాపాసు పుస్తకాలు ఇచ్చారని, ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టంతో మరింత భద్రత పెరిగిందన్నారు. ఇక్కడి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు కొత్త వ్యవసాయ చట్టాన్ని అమలు చేసేందుకు ప్ర యత్నిస్తుందన్నారు. వెంటనే వాటిని రద్దుచేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. తమ ప్ర భుత్వానికి రైతులు అండగా నిలువాలని కోరా రు.  అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి మాట్లాడుతూ రైతుల కోసం అనేక సంక్షేమ ప థకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కొత్త రెవె న్యూ చట్టం ద్వారా రైతులకు పూర్తి రక్షణ కలుగుతుందన్నారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు నుంచి పంటల అమ్ముకునే వరకు ఎ లాంటి ఇబ్బందుల్లేకుండా తెలంగాణ ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇప్పు డు రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు.


logo