శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 09, 2020 , 03:51:32

ఉద్యోగాలిప్పిస్తానని టోకరా

ఉద్యోగాలిప్పిస్తానని టోకరా

  • 32.50 లక్షలు వసూలు
  • ఒకరి అరెస్ట్‌ 

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): వి దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ కోటేశ్వర్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన వివరాలు వెల్లడించారు. త మిళనాడుకు చెందిన కందిపట్ల మురళి అలియాస్‌ వాసుదేవ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని రా మవరానికి చెందిన అమ్మాయిని ప్రేమిం చి పెండ్లి చేసుకుని అత్తగారింట్లో ఉంటు న్నాడు. భార్య క్రిస్టియన్‌ కావడంతో ప్రా ర్థనలకు వెళ్తుండగా, గోదావరిఖనికి చెం దిన ఫాస్టర్‌ రామగిరి శంకర్‌, మురళికి పరిచయమయ్యాడు. అతని సాయంతో మురళి తరుచూ గోదావరిఖనికి వస్తుం డేవాడు. ఈ ప్రాంతంలోని యువకుల కు విదేశాల్లో డంపర్‌ ఆపరేటర్లుగా పెట్టిస్తానని నమ్మబలికాడు. శ్రీరాంపూర్‌కు చెందిన డంపర్‌ ఆపరేటర్లు బండారి చ క్రపాణి, గోరువంతల స్వామి వద్ద రూ. 65వేల చొప్పున తీసుకుని కొంత కా లంగా కనిపించలేదు. మోస పోయామ ని భావించి బాధితులు ఫిర్యాదు చేయ గా, గురువారం మంచిర్యాల బస్టాండ్‌ వద్ద పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.

ఆ యనను విచారించగా గోదావరిఖని, రా మవరం, జైపూర్‌ ఏరియాల్లో కూడా అ తనిపై చీటింగ్‌ కేసు నమోదైనట్లు ఆయ న తెలిపారు. ఇతను నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తానని, విదేశాల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని, ఇంది రా ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో యువకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసి రి మాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఎస్‌ఐ మంగీలాల్‌ ఉన్నారు.