ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Oct 09, 2020 , 03:51:32

వారం రోజులు.. 6602 మెట్రిక్‌ టన్నులు

వారం రోజులు..  6602 మెట్రిక్‌ టన్నులు

  • కస్టమ్‌ మిల్లెడ్‌కు 15 వరకు గడువు 
  • ఇప్పటి వరకు 92 శాతం సీఎంఆర్‌ పూర్తి
  • లక్ష్యం పూర్తి చేస్తామంటున్న అధికారులు

మంచిర్యాల అగ్రికల్చర్‌: ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి బియ్యంగా మార్చి సరఫరా చేయ డం (కస్టం మిల్లెడ్‌ రైస్‌) జిల్లాలో ఇప్పటి వర కు 92 శాతం పూర్తయింది. గతేడాది వాన కాలంలో ఐకేపీ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌, ఐటీడీఏ ఆధ్వర్యంలో 126 వరి ధాన్యం కొనుగో లు కేంద్రాల ద్వారా 23,922 మంది రైతుల నుంచి 1,19,044.360 మెట్రిక్‌ టన్నుల ధా న్యాన్ని సేకరించి 1,16,653.440 మెట్రిక్‌ ట న్నులను 19 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు, 13 రా రైస్‌ మిల్లులకు తరలించారు. వీ టిని 67, 68 శాతం మరాడించి మిల్లుల నుంచి తిరిగి ప్రభుత్వానికి 78,304.114 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ (కస్టం మిల్లెడ్‌ రైస్‌) ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 71,702.439 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ (92 శాతం) పూర్తి చేశారు. మిల్లర్లకు  15 గడువు కాగా వారంలో 6601.675 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. 

సేకరించినవి..

జిల్లాలోని మిల్లులకు ధాన్యం సరఫరా చేయగా మిగతా ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగ ర్‌కు తరలించారు. జిల్లాలో ఒక్కో మిల్లుకు దా ని సామర్థ్యం ఆధారంగా ధాన్యాన్ని అందిం చారు. ఇచ్చిన ధాన్యానికి అనుగుణంగా ప్రమాణాలు పాటించి ప్ర భుత్వానికి బియ్యం అప్పగించాల్సిన బాధ్యత మిల్లర్లకు అప్పగించింది. క్వింటాల్‌ ధాన్యానికి ముడిబియ్యం 67 శాతం, ఉప్పుడు బియ్యం అయితే 68 శాతం ఇచ్చి మిల్లెడ్‌ తరువాత బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు 8 కిలో మీటర్ల పరిధిలోపు రవాణా చార్జీలను మి ల్లర్లు భరించాలని, అంతకు మించి దూరమైతే కిలో మీటరుకు టన్నుకు 34 పైసల చొప్పున మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తుందనే నిబంధన పె ట్టింది. మంచిర్యాల జిల్లా పరిధిలో 19 మిల్లులకు కస్టమ్‌ మిల్లెడ్‌ అనుమతి లభించింది. ఈ మిల్లుల్లో ఇప్పటి వరకు ఆరు మిల్లులు వంద శాతం సీఎంఆర్‌ను పూర్తి చే శాయి. మరికొన్ని లక్ష్యం సమీపంలో ఉండగా నాలుగు మాత్రం 80 శాతం టార్గెట్‌ను మాత్ర మే పూర్తి చేశాయి. వీరంతా మరో వారంలోగా వంద శాతం సీఎంఆర్‌ అందించాల్సి ఉంటుంది.

గడువులోగా వందశాతం పూర్తి చేస్తాం..:  గెడం గోపాల్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం, మంచిర్యాల

ప్రభుత్వం ఇచ్చిన గడుపులోపు వంద శా తం సీఎంఆర్‌ సాధిస్తాం. ఇప్పటి వరకు 92 శాతం పూర్తయింది. టార్గెట్‌కు దూరంగా ఉ న్న మిల్లులపై దృష్టి సారించాం. ఇందు కోసం రెవెన్యూ అధికారులకు రాత్రి, పగలు రెండు షిప్టులుగా విధులు కేటాయించాం. వారు మిల్లెడ్‌ సమయాన్ని అప్‌డేట్‌ చేస్తున్నారు. రిపోర్టును ఉన్నతాధికారులకు వివరిస్తున్నాం. జిల్లాలోని 19 బాయిల్డ్‌ మిల్లుల కు 99897.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంపించాం, దీనికి వారు 67077.541 మె ట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 60474.629 మెట్రిక్‌ టన్ను లు పంపారు. ఇందులో సివిల్‌ సప్లయ్‌ శాఖ కు 46038.530 మెట్రిక్‌ టన్నులు, ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ 9949.023 మెట్రిక్‌ టన్నులు, రా రైస్‌ 4487.076 (90 శాతం) మెట్రిక్‌ టన్నులు పెట్టారు. ఇంకా 6602. 912 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉంది. అ లాగే 13 రా రైస్‌ మిల్లులకు 16,756.080 మెట్రిక్‌ టన్నులు పంపగా 11,226.574 సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 11,227.810 (వంద శాతం) మెట్రిక్‌ ట న్నులు పౌర సరఫరాల శాఖకు పంపారు.  వారం మాత్రమే గడువు ఉంది. 


logo