శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 08, 2020 , 02:24:19

చేనులోనే విగతజీవులుగా..

చేనులోనే విగతజీవులుగా..

  • విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి
  • విద్యుత్‌ కంచెకు తగిలి ప్రమాదం
  • మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
  • నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం భోసిలో విషాదం

తానూర్‌ : నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం భోసి గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకు మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరా ల ప్రకారం.. భోసి గ్రామానికి చెందిన కర్జల రాములు (55)కు 12 ఎకరాల భూమి ఉంది. ఇందులో సోయాతో పాటు వివిధ పంటలు వేశాడు. ప్రస్తుతం సోయా చేతికి రావడంతో నూర్పిడి చేసి చేనులోనే కుప్పగా పోశారు. దానిచుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేశారు.

ఈ క్రమంలో బుధవారం ఉద యం పెద్ద కొడుకు మురళి (27)తో కలిసి సోయాను ఆరబెట్టేందుకు చేనుకు వెళ్లారు. ఫెన్సింగ్‌కు విద్యుత్‌ తీగను అమర్చిన విషయాన్ని వారు మరిచి చేనులోకి వెళ్లారు.దీంతో విద్యుత్‌ తీగలకు తగలి షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.  భర్త, కొడుకు మధ్యాహ్నం 12 గంటలైనా ఇంటికి రావడంతో రాములు భార్య శ్యామల రోజువారీ కూలీకి వచ్చే సాయిని చేనుకు పంపించింది. అతను వెళ్లి చూడగా, ఇద్దరూ మృతిచెంది కనిపించడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ రాజన్న, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రాజన్నకు ఇద్దరు కొడుకులు, ఒక కూ తురు ఉన్నారు. చిన్న కొడుకు శ్రీకాంత్‌ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.