శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Oct 08, 2020 , 02:24:24

వేర్వేరు కారణాలతో ఇద్దరి మృతి

వేర్వేరు కారణాలతో ఇద్దరి మృతి

పరీక్ష తప్పుతానని..

జైపూర్‌: మం డలంలోని రామారావుపేట గ్రామానికి చెందిన జిట్ట శ్రావ్య (18) హైదరాబాద్‌లోని ఓ దవాఖాన లో చికిత్స పొందు తుండగా మంగళవా రం రాత్రి మృతి చెం దింది. పట్టణ రెండో పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ గంగరాజు గౌడ్‌ తెలిపిన వివరా ల ప్రకారం.. శ్రావ్య కరీంనగర్‌లోని ప్రైవేట్‌ జూనియర్‌ కళా శాలలో ఇంటర్‌ ద్వితీయ సం వత్సరం పూర్తి చేసింది. గత నెల జరిగిన నీట్‌ పరీక్షలు సక్రమంగా రాయలేదని, ఫెయిల్‌ అవుతానని మ నస్తాపం చెంది సెప్టెంబర్‌ 8వ తేదీ రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల దవాఖానకు తరలించా రు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె అపస్మారక స్థితికి చేరుకుని మంగళవా రం రాత్రి మృతి చెందింది. ఆమె తండ్రి శ్రీ నివాస్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 

ప్రియుడు మోసం చేశాడని..

కెరమెరి: ప్రియుడు మోసం చే శాడని మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆ త్మహత్య చేసుకుం ది. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకా రం.. కెస్లాగూడకు చెందిన ఆత్రం గౌతమి (17), అదే గ్రామానికి చెందిన కుమ్రం గుణవంత్‌రావ్‌ ప్రేమించుకున్నారు. ప్రియుడు పెండ్లికి నిరాకరించడంతో 5న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఆసిఫాబాద్‌ ద వాఖానకు తరలించగా అక్కడి వైద్యాధికారుల సూచన మేరకు మంచిర్యాలకు తరలించారు. ఓ ప్రైవేట్‌ దవాఖానలో వైద్యం పొం దుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మం గళవారం రాత్రి మృతి చెందింది. గౌతమి ఆసిఫాబాద్‌లోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఆమె తండ్రి విశ్వేశ్వర్‌రావ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.