శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Oct 06, 2020 , 00:28:37

నులి పురుగులను నివారించాలి

నులి పురుగులను నివారించాలి

మంచిర్యాల అగ్రికల్చర్‌: నులి పురుగుల ని వారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో మంచిర్యాల డీఎంహెచ్‌వో నీరజ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ ఏడాది నుంచి 19 సంవత్సరాల వయ స్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు అందిస్తున్నామన్నారు. ఆశ కార్యకర్తలు, అం గన్‌ వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పిల్లలకు మాత్రలు ఇస్తారన్నారు. ఏడాది నుంచి రెండేండ్ల వరకు చిన్నారులకు సగం మాత్రను పొడిచేసి చెంచాతో నీటిలో కలిపి ఇవ్వాలని సూచించారు. రెండు నుంచి మూ డేండ్ల వరకు ఒక మాత్ర పొడి చేసి నీటితో కలి పి వేయాలని, 3-19 ఏండ్ల వరకు ఒక మాత్ర చప్పరించేలా లేదా నమిలి మింగేలా చూడా లన్నారు. అనంతరం కాలనీల్లో తిరుగుతూ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో డీఎంహెచ్‌వోతోపాటు జిల్లా ఉప వైద్యాధికారి ఫయాజ్‌ ఖాన్‌, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి వంశీకృష్ణ, ఏఎన్‌ఎంలు, అంగన్‌ వాడీ టీచర్లు, ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు.

దండేపల్లి: ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ  తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఎం ఫయాజ్‌ఖాన్‌తో కలిసి డీఎంహెచ్‌వో ప్రారంభించారు.  అనంతరం దవాఖానలోని ల్యాబ్‌, కొవిడ్‌-19 పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సం ఖ్య పెంచాలన్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యాధికారులు స్ఫురణ, హరీశ్‌ ఉన్నారు.logo