శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 06, 2020 , 00:25:26

గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే

గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే

కోటపల్లి : వ్యవసాయేతర భూముల సర్వేను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా పరిషత్‌ సీఈవో నరేందర్‌ సూ చించారు. మండల కేంద్రంలో చేపట్టిన సర్వేను సీఈవో నరేం దర్‌, ఎంపీడీవో భాస్కర్‌ పరిశీలించారు. సర్వే తీరు, యాప్‌లో నమోదు చేస్తున్న వివరాలను పంచాయతీ కార్యదర్శి రవళిని అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌ చేస్తున్న సమయంలో తప్పు లు దొర్లకుండా పంచాయతీ కార్యదర్శులు జాగ్రత్త పడాలని సూచించారు. ప్రతి ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలను నమో దు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సర్వేకు వెళ్తున్న సమయంలో ముందుగా కాలనీ వాసులకు సమాచారం అం దించాలని పేర్కొన్నారు. కోటపల్లి, ఎసన్వాయి, సర్వాయిపేట, ఎడగట్ట, పిన్నారం, వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలుగామ గ్రామాల్లో చేపట్టిన సర్వేను ఎంపీడీవో భాస్కర్‌, ఎంపీవో సత్యనారాయణ పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు సూపరింటెండెంట్‌ లక్ష్మయ్య, టైపిస్టు శివనాగ సాత్విక్‌, రవళి, రాజశేఖర్‌, సుధాకర్‌ రెడ్డి, స్వర్ణక్క, తదితరులు పాల్గొన్నారు. 

వివరాలు అందించాలి

మంచిర్యాలటౌన్‌ : మున్సిపల్‌ సిబ్బందికి అవసరమైన వివరాలను అందించి ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ జీ స్వరూపారాణి కో రారు. ఇంటికి సంబంధించిన భూమి డాక్యుమెంట్‌ దగ్గర ఉం చుకోవాలని కోరారు. 21, 22 వార్డులు రాంనగర్‌, లేబర్‌కాలనీ, పద్మశాలీ కాలనీల్లో ఆమె ధరణి వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇంటి యజమానులతో మాట్లాడారు. 

చెన్నూర్‌ టౌన్‌ : మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించినట్లు కమిషనర్‌ తెలిపారు. స్థానిక రౌండ్‌ హనుమాన్‌ టెంపుల్‌, లైబ్రరీ వీధితో పాటు వార్డుల్లో యజమానుల వివరాలు వీఆర్వో కరుణాకర్‌ సేకరించారు. స్థానిక 17వ వార్డులో మెప్మా సిబ్బంది ఇంటింటా వివరాలు తీసుకున్నారు. 

తాండూర్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా సర్వే కొనసాగుతున్నది. సర్వేను ఎంపీపీ పూసాల ప్రణయ్‌ కుమార్‌, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఇన్‌చార్జి ఎంపీడీవో వేణుగోపాల్‌ పరిశీలించారు. అధికారులు ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని వారు సూచించారు. 

హాజీపూర్‌ : నంనూర్‌లో ఇంటింటా ఆస్తుల సర్వేను ఎంపీ వో రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీవో మా ట్లాడుతూ ఆస్తుల సర్వేను పకడ్బందీగా నిర్వ హించాల న్నా రు. నంనూర్‌లో ఇండ్ల కొలతలు తీసుకున్నారు. వివరాలను యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 

చెన్నూర్‌ రూరల్‌ : వ్యవసాయేతర ఆస్తులపై సర్వే నిర్వ హి స్తున్నారు. పొన్నారంలో గ్రామపంచాయతీ ఇన్‌చార్జి కార్య ద ర్శి పుప్పాల రామకృష్ణాపటేల్‌ వివరాలను సేకరించారు. ఇం టింటికీ వెళ్లి పూర్తి వివరాలను ఆన్‌ లైన్‌ చేశారు. సర్వేను ఎంపీ వో బీర్ల బీరయ్య పర్యవేక్షించారు.

కాసిపేట : దేవాపూర్‌, మదిమాడ గ్రామాల్లో చేపట్టిన సర్వే ను ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ఎంపీడీవో ఎంఏ అలీం పరిశీలించారు. అక్టోబర్‌ 10వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని, పూర్తి వివరాలను నమోదు చేస్తామని ఎంపీడీవో చెప్పారు. మాజీ సర్పంచ్‌ రొడ్డ రమేశ్‌, కార్యదర్శులు పాల్గొన్నారు. 

తాజావార్తలు