బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Oct 05, 2020 , 02:12:49

ప్రతి వార్డుకూ మిషన్‌ భగీరథ నీటిని అందిస్తాం

ప్రతి వార్డుకూ మిషన్‌ భగీరథ నీటిని అందిస్తాం

ఎమ్మెల్యే దివాకర్‌రావు    

పైపులైన్‌ పనులకు భూమిపూజ  

మంచిర్యాలటౌన్‌: పట్టణంలోని అన్ని వార్డులకూ మిష న్‌ భగీరథ పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 31, 34 వార్డుల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరిపడా తాగునీరు అందించడమే లక్ష్యంగా పైపులైన్లను విస్తరిస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ తాగునీరు అందించడమే మిషన్‌ భగీరథ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు బీ సురేశ్‌, మాదంశెట్టి సత్యనారాయణ, గాదె సత్యం, పోరెడ్డి రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గొంగళ్ల శంకర్‌, కార్కూరి చంద్రమౌళి, పల్లపు తిరుపతి, శ్రీపతి వాసు, బొట్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. logo