శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Oct 04, 2020 , 01:34:48

ఆస్తి వివరాలు నమోదు చేయాలి

ఆస్తి వివరాలు నమోదు చేయాలి

  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
  • భీమారం, జైపూర్‌లో సర్వసభ్య సమావేశానికి హాజరు
  • పనులపై అధికారులకు ఆదేశాలు

భీమారం/ జైపూర్‌/ మందమర్రి: ఆస్తి వివ రాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభు త్వ విప్‌ బాల్క సుమన్‌ అధికారులను ఆదేశించారు. భీమారం, జైపూర్‌, మందమర్రి మం డల సర్వసభ్య సమావేశాలు శనివారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. భీమారంలో ఎంపీపీ దీపికా రెడ్డి అధ్యక్షత వహించగా, జైపూర్‌లో ఎంపీపీ గోదారి రమాదేవి, మందమర్రిలో గుర్రం మంగ అధ్యక్షత వహించారు. ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రకృతి వనాలు, డంప్‌ యార్డు, శ్మశాన వాటి క, కంపోస్టు నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సభ్యులు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను వేగంగా పూర్తి చే యాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ తెచ్చిన రెవెన్యూ చట్టం దేశంలో ఎక్క డా లేదని, దీంతో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయని పేర్కొన్నారు.

భీమారంలో కొనసాగుతున్న డబుల్‌ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. భీమారంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతి బాపు తదితరులు ఉన్నారు. శ్రీరాంపూర్‌ సర్కిల్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌ బందోబస్తు నిర్వహించారు.  జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ ప్రసాద్‌వర్మ ఉన్నారు. మందమర్రిలో ఎంపీడీ వో ప్రవీణ్‌ కుమార్‌, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ వేల్పుల రవి, సహకార సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. 

కమిటీలు ఏర్పాటు చేయాలి.

మందమర్రి: మందమర్రి మున్సిపల్‌ పాలకవర్గం లేక అభివృద్ధి కుంటు పడుతుందని, దాన్ని అధిగమించేందుకు సీనియర్‌ నాయకులు వార్డుల వారీగా ఇన్‌చార్జిలను నియమించాలని సూచించారు. వారు సంక్షేమ పథకా లు, అభివృద్ధి పనులపై అవగాహన కల్పించాలన్నారు. రెండేండ్లలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికతో పని చేస్తానని హామీ ఇచ్చారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ జంగం కళ, మందమర్రి, క్యాతన్‌పల్లి కమిషనర్లు గద్దె రాజు, వెంకటనారాయణ, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్‌, సీఐ ఎడ్ల మహేశ్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

యువతకు ఉపాధి కల్పించండి

జైపూర్‌: సింగరేణి ప్రభావిత గ్రామాల్లో భూనిర్వాసితులతోపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని విప్‌ బాల్క సుమన్‌ అధికారులకు సూచించారు. విద్యుత్‌ కేంద్రం అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇందారం ఓసీలో యువతకు ఉపాధి కల్పించాలన్నారు. జీఎం శాస్త్రి, ఇందారం ఓసీ ప్రాజెక్టు అధికారి రాజేశ్వర్‌రెడ్డి, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ అధికారులు ఉన్నారు.