శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 03, 2020 , 05:29:36

మంచిర్యాలలో ఐసొలేషన్‌ కేంద్రం

మంచిర్యాలలో ఐసొలేషన్‌ కేంద్రం

త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : పట్టణంలోని మంచిర్యాల క్లబ్‌లో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం ఐసొలేషన్‌ కేంద్రం ఇన్‌చార్జి, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ ఖాన్‌, హెచ్‌ఈవో గుండేటి నాందేవ్‌ మున్సిపల్‌ సిబ్బందితో గదులను శుభ్రం చేయించారు. కరోనా పాజిటివ్‌తో ఐసొలేషన్‌ కేంద్రంలో ఉం టున్న వారికి భోజన వసతిని జిల్లా దవాఖాన మెస్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్ల్లు అధికారులు వెల్లడించారు.