శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Oct 03, 2020 , 05:29:32

న్యాయం చేయండి

న్యాయం  చేయండి

ఉపాధ్యాయుడి భార్య మౌన పోరాటం

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణ 

పిల్లలతో కలిసి ఇంటి ఎదుట బైఠాయింపు

చెన్నూర్‌ టౌన్‌ : తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని చెన్నూర్‌ పట్టణానికి చెందిన ఓ మహిళ మౌనపోరాటానికి దిగింది. బాధితు రాలు తెలిపిన వివరాల మేరకు చెన్నూర్‌ పట్టణానికి చెందిన బిల్ల తిరుపతయ్య సుద్దాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా (ఎస్జీ టీ) పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం భార్గవిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరికి వైకల్యం ఉంది. తిరుపతయ్య ఐదేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తన భార్యా పిల్లలను పట్టించుకోవడం లేదు. దీంతో భార్గవి శుక్రవారం తన పిల్లలతో కలిసి ఆస్నాద్‌లో సదరు మహిళ ఇంటి వద్ద బైఠా యించింది. తనకు న్యాయం జరిగేదాకా కదిలేదని భీష్మించుకుని కూ ర్చుంది. ఎస్‌ఐ విక్టర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తా మని బాధితురాలికి హామీ ఇవ్వడంతో శాంతించింది. అనంతరం తిరుపతయ్యతో పాటు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. కౌన్సె లింగ్‌ నిర్వహించారు. కాగా, ఈనెల 15న హన్మకొండ లో తమ బం ధువులు, పెద్దల సమక్షంలో ఈ విషయాన్ని వివరి స్తామని బాధితులు పేర్కొన్నారు.