మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Oct 01, 2020 , 04:51:52

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

  • 60 వేల మందికి తీరనున్న దాహార్తి
  • రూ.40.10 కోట్లతో పైప్‌లైన్‌ నిర్మాణం
  • 35 ఏండ్ల వరకు నీటిగోస ఉండదు..
  • గిరిజన చట్టం రద్దుకు సమష్టి కృషి
  • మందమర్రిని ఆదర్శంగా నిలుపుతాం..
  • రైతులకు కేంద్రం తీరని ద్రోహం చేసింది..
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌, విప్‌ బాల్క సుమన్‌
  • అర్బన్‌ మిషన్‌ భగీరథ పనులకు భూమిపూజ

మందమర్రి: మిషన్‌ భగీరథతో మందమర్రి మున్సిపాలిటీ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. పట్టణానికి సం బంధించి 60 వేల మంది దాహం తీర్చేందుకు రూ. 40.10 కోట్లతో నిర్మించే అంతర్గత పైప్‌లైన్‌  నిర్మాణ పనులను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి బుధవారం ప్రారంభించా రు. అనంతరం మాట్లాడుతూ ఏడు దశాబ్దాల నుంచి పాలకులు కనీసం తాగునీటి సమస్యను తీర్చలేకపోవడం దురదృష్టమన్నారు. 

 స్వరాష్ట్రం ఏర్పడితే ఏం వస్తుంది అని విమర్శించిన వారే నేడు ఆశ్చర్య పోతున్నారని, ఆ విధంగా సీఎం రాష్ర్టాన్ని పాలిస్తున్నారన్నారు. ప్రజలకు తాగునీరివ్వాలని గత పాలకులకు కనీసం పట్టలేదని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల కష్టాలు తొలిగిపోవాలని సీఎం అ నేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే అంధకారం అలుముకుంటుందని విమర్శించిన వారు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో ఆశ్చర్యపోతున్నారన్నారు. మందమర్రి మున్సిపాలిటీని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న 1/70 యాక్ట్‌ రద్దుకు సమష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథతో మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటపల్లి, ఊరు మందమర్రి, నార్లాపూర్‌, ఊరు రామకృష్ణాపూర్‌ను కలుపుకొని 24 వార్డు ల్లో గల 16,229 కుటుంబాలకు రక్షిత తాగు నీరు అందిస్తామన్నారు. మున్సిపాలిటీలో 77.75 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌లను ఏర్పా టు చేస్తున్నామని ఒక్కసారి పనులు పూర్తయితే 35 ఏండ్ల వరకు ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయన వెల్లడించారు. డీఎంఎఫ్‌టీ, టీయూఎఫ్‌ఐడీసీ, ఏఎఫ్‌సీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, తదితర పథకాల కింద మున్సిపాలిటీలో సుమారు రూ. 50 కోట్లతో వార్డుల్లో అంతర్గత డ్రైనేజీలు, రోడ్లు, ప్రధాన రహదారులు, పార్కులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 

మున్సిపాలిటీలో 6 వేల మంది మహిళా సహాయ సంఘాల సభ్యులకు ఆర్థిక ప్రగతి కోసం రూ. 3 కోట్లతో చేపట్టనున్న సమ్మక్క-సారక్క సమీకృత భవనాల నిర్మాణానికి ప్రతి పాదనలు పంపి స్థల పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ లో గిరిజన చట్టం అమల్లో ఉన్నందున ఎన్నికలు జరగడం లేదని ఇక్కడ కేవలం 4 శాతం మాత్ర మే గిరిజనులున్నారని ఎందుకు చట్టం అమల్లో ఉందో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దశాబ్దాలు గా మున్సిపాలిటీని పట్టి పీడిస్తున్న గిరిజన చట్టం పీడ విరుగుడు చేయిస్తానని హామీ ఇచ్చారు. పట్టణానికి మొదటిసారి వచ్చిన మంత్రిని సుమన్‌ స్థానిక నాయకులతో కలసి పూలమాల, శాలువాలతో సన్మానించి ఖడ్గాన్ని బహూకరించారు. అనంతరం స్థానిక నాయకు లు మంత్రి తోపాటు విప్‌ను స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. ముందుగా మంత్రి, విప్‌కు స్థానిక నాయకులు పాత బస్టాం డ్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద స్వాగతం పలికి ర్యాలీ తీశారు. జడ్పీటీసీ సభ్యుడు వేల్పుల రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కలెక్టర్‌ భారతీ హోళికేరి, మంచిర్యాల ఆర్డీవో రమేశ్‌, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గద్దె రాజు, డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

సబ్సిడీ ట్రాక్టర్ల అందజేత

రామకృష్ణాపూర్‌: టీఎస్‌ ప్రైయిడ్‌ పథకంలో భాగంగా  క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఐదుగురు ఎస్సీ లబ్ధిదారులకు ట్రాక్టర్లు మంజూరవ గా మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ రిబ్బన్‌ కట్‌ చేసి అందించారు. క్యాతనపల్లి 7వ వార్డు, 10వ వా ర్డుకు చెందిన ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రయోజనం పొందారు. కమిషనర్‌ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్‌  సత్యం, వార్డు ప్రజలు పాల్గొన్నారు. logo