శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Sep 26, 2020 , 02:05:58

మున్సిపల్‌ అభివృద్ధికి పాటుపడాలి

మున్సిపల్‌ అభివృద్ధికి పాటుపడాలి

  •  ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

మందమర్రి ;  మందమర్రి మున్సిపల్‌ అభివృద్ధికి కృషి చేయాలని చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. స్థానిక సింగరేణి సీఈఆర్‌ క్లబ్‌లో శుక్రవారం మున్సిపల్‌, నేషనల్‌ హైవే అధికారులు, టీబీజీకేఎస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ము న్సిపల్‌లో పనుల పురోగతి అడిగి తెలుసుకున్నా రు. వార్డుల వారీగా సమస్యలు తెలుసుకోవడం తో పాటు రోడ్లు, డ్రైనేజీ పనుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణాల అభివృద్ధిలో భాగంగానే వార్డుల వారీగా అధికారులను నియమిస్తున్నదన్నారు. టీయూఎఫ్‌డీసీ, ఎస్‌ఎఫ్‌టీ రూ. 6.64 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఐక్యంగా పని చేస్తేనే అభివృద్ధి పనులు వేగంగా జరుగు తా యన్నారు. 

ఫోర్‌లేన్‌ రోడ్డుకు సహకరించాలి

మంచిర్యాల నుంచి రేపల్లేవాడ వరకు చేపడుతున్న 363 ఫోర్‌లేన్‌ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని విప్‌ సుమన్‌ కోరారు. రహదారి నిర్మాణంలో నిర్వాసితులను న్యాయం చేయాలని నేషనల్‌ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. పాతబస్టాండ్‌ నుంచి యాపల్‌ వరకు రోడ్డును రెండు వైపులా 72 ఫీట్లుగా నిర్ణయించారని, ఆరు ఫీట్ల వరకు తగ్గించేందుకు అధికారులు అంగీకరించారన్నారు. హైవే అథారిటీ ప్రాజెక్టు అధికారి గోవర్ధన్‌ మాట్లాడుతూ నిర్వాసితులకు నష్టం జరుగాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విప్‌ సుమన్‌ టీబీజీకేఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ వేల్పుల రవి, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గద్దె రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రావు, మందమర్రి సీఐ మహేశ్‌, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు, టీబీజీకేఎస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.