బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Sep 26, 2020 , 02:07:01

ముగ్గురు హాస్టల్‌ వార్డెన్ల సస్పెన్షన్‌

ముగ్గురు హాస్టల్‌ వార్డెన్ల సస్పెన్షన్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో

మంచిర్యాల అగ్రికల్చర్‌ : జిల్లా గిరిజన శాఖ పరిధిలోని వసతి గృహాలకు చెందిన ముగ్గురు వార్డెన్లను సస్పెండ్‌ చేస్తూ ఐటీడీఏ పీవో భావేశ్‌ మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా హాస్టల్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యార్థి, కుల సంఘాలు నిరసన తెలపడంతో ఈ నెల 17న ఐటీడీఏ పీవో  విచారణ చేపట్టారు. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచిర్యాల ఎస్టీ బాలుర వసతి గృహం, బాలికల, మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలకు చెందిన వార్డెన్లు నైతం లక్ష్మణ్‌, మల్లారెడ్డి, మీనా రెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయించారు. పీవో విచారించారు. కరోనా సమయంలో వసతి గృహాలు తెరచి ఇద్దరు విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వడం, ఓ మహిళను వాచ్‌మెన్‌గా నియమించి, ఆమెతోనే వంట చేయించుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా వసతి గృహంలో మద్యం తాగడం కారణాలతో వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి నారాయణ వెల్లడించారు.logo