గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Sep 25, 2020 , 02:27:53

రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

కోటపల్లి : రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో శేషాద్రి అధికారులకు సూచించారు. మండలంలో ని సిర్సా గ్రామంలో చేపట్టిన రైతు వేదిక పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ నాణ్యతతో పనులు చేపట్టాలన్నా రు. పనులను సంబంధిత అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షించాలని, సర్పంచ్‌లు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. వర్షా లు తగ్గుముఖం పట్టినందున నిర్మాణ ప నులను మరింత వేగవంతం చేయాలన్నా రు. ఇందులో ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీ వో సత్యనారాయణ, సర్పంచ్‌ గొడిశెల మధుసూదన్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ పెద్దింటి పు న్నంచంద్‌ పాల్గొన్నారు.

ప్రకృతి వనాలను రక్షించాలి 

లక్షెట్టిపేట రూరల్‌ : మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని హన్మంతు పల్లి గ్రామంలో శ్మశాన వాటిక పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడారు. పల్లె ప్రకృతి వనాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డంప్‌ యార్డుల నిర్మాణం త్వర గా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆయన సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై సమావేశం 

భీమారం : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లతో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతి బాపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ల్లో శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ షెడ్డు నిర్మా ణం, పల్లె ప్రకృతి వనాలు, ఈజీఎస్‌ పను లు వేగవంతం చేయాలన్నారు. 


logo