శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Sep 24, 2020 , 01:38:45

జిల్లాలో 40.4 మిల్లీ మీటర్ల వర్షం

జిల్లాలో 40.4 మిల్లీ మీటర్ల వర్షం

  • n నెన్నెలలో మునిగిన పంటలు
  • n మంచిర్యాలలో ఇండ్లలోకి వచ్చి చేరిన వరద

మంచిర్యాల అగ్రికల్చర్‌ : జిల్లాలో మం గళవారం సాయంత్రం నుంచి బుధవా రం తెల్లవారు జాము వరకు వర్షం కురిసింది. జిల్లాలో 40.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. జన్నారం మండలంలో 3.0 మిల్లీ మీటర్లు, దండేపల్లిలో 12.3, లక్షెట్టిపేటలో 27.2, హా జీపూర్‌లో 45.4, కాసిపేటలో 29.0, తాండూర్‌లో 24.2, భీమినిలో 9.0, కన్నెపల్లిలో 22.7, వేమనపల్లిలో 49.5, నెన్నెలలో 37.1, బెల్లంపల్లిలో 33.0, మందమర్రిలో 61.1, నస్పూర్‌లో 80. 8, మంచిర్యాలలో 76.6, జైపూర్‌లో 55.2, భీమారంలో 47.5, చెన్నూర్‌లో 64.1, కోటపల్లిలో 49.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే జిల్లాలో జూన్‌ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు పది శాతం అధిక వర్షపాతం న మోదైంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

నీట మునిగిన పంటలు

నెన్నెల : మండలంలోని గొల్లపల్లి, మైలారం గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పత్తి, వరి పంటలు నీట మునిగా యి. పత్తి పంట కాతకు వచ్చిందని, వర్షం వల్ల కాయలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట నీట మునిగిపోవడంతో పాటు ఇసుక మేటలు వేసిన ట్లు రైతులు తెలిపారు. రెండు గ్రామాల్లో దాదాపు వంద ఎకరాల వరకు పంటలు నీట మునిగినట్లు గొల్లపల్లి సర్పం చ్‌ ఇందూరి శశికళ తెలిపారు. 

ఇండ్లలోకి చేరిన వరద

మంచిర్యాలటౌన్‌ : పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మంగళవా రం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద వచ్చి చేరింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కైలాస్‌గిరి కాల నీ, బృందావన్‌కాలనీ, సప్తగిరి కాలనీ, సు న్నంబట్టి వాడ, హమాలీవాడ, గౌతమీనగర్‌, రాంనగర్‌, తదితర ప్రాంతా ల్లో వరద రోడ్లపైకి వచ్చి చేరింది.