శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Sep 24, 2020 , 01:38:46

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

  • n వందలాది ట్రాక్టర్లతో తరలివచ్చిన వేలాది మంది రైతులు 
  • n సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
  • n చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతలు 
  • n నృత్యాలు చేస్తూ, పటాకలు కాల్చి సంబురాలు
  • n మిన్నంటిన నినాదాలు.. పులకించిన చెన్నూర్‌.. 
  • n ట్రాక్టర్‌ నడిపి హుషారెత్తించిన విప్‌ సుమన్‌

మంచిర్యాల, నమస్తే తెలంగాణ/చెన్నూర్‌ టౌన్‌ : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలో బుధవారం నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపేందుకు కృతజ్ఞతగా జైపూర్‌, భీమారం, కోటపల్లి, మందమర్రి మం డలాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. చెన్నూర్‌ పట్టణం లోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కిష్టంపేట వరకు దాదాపు 500 ట్రాక్టర్లలో రైతులు తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ కేసీఆర్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన విప్‌ బాల్క సుమన్‌ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విప్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షే మానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నవశకం ఆరంభమైందన్నారు. శతాబ్దాల నాటి చట్టాల బూజు దులుపు తూ అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతు న్నారని స్పష్టం చేశారు. అందుకే నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందిం చినట్లు స్పష్టం చేశారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రైతు లు, ప్రజలకు అండగా నిలిచే విధంగా రెవెన్యూ చట్టం ఉందన్నారు.

ఉద్యోగుల్లో ఆనందం

రెవెన్యూ చట్టం కేవలం ప్రజలలోనే కాకుండా ఉద్యోగులల్లో కూడా ఆనందం నింపిందన్నారు. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని అధికారులు సంతోషంగా ఉన్నారన్నారు. మరోవైపు తాతల కాలం నుంచి గౌరవ వేతనంతో బతుకుతున్న తమకి జీవితంలో పే స్కేల్‌ ఉద్యోగం వస్తుందని ఊహించలేదని వీఆర్‌ఏలు సంబుర పడుతున్నారని స్పష్టం చేశారు. నామమాత్రపు గౌరవ వేతనంతో బతుకుతున్న వారి ఇబ్బందులను గ్రహించి కేసీఆర్‌ తమ వేతనం రూ.10 వేలకు పెంచారని, వీఆర్‌ఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బాల్క సుమన్‌ తెలిపారు. 

ధరణి వెబ్‌సైట్‌ ఆయువు పట్టు

ధరణి వెబ్‌సైట్‌ భూమిల అన్నింటికీ ఆయువుపట్టని, భూవి వాదాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ ను రూపొందించినట్లు వివరించారు. ప్రతి విషయంలో పార దర్శకత, జవాబుదారీతనం ఉండే విధంగా నూతన విధానా నికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కొత్త రెవెన్యూ చట్టం తో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవన్నారు. ఈ చట్టం వల్ల రైతు లకు ఎన్నో లాభాలు ఉన్నాయ      ని అన్నారు.

రైతుల పాలిట దేవుడు

రైతుల గురించి ఆలోచిస్తూ మా క్షేమం కోరే కేసీఆర్‌ సారు వెంటే   మేం ఉంటాం. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో మమ్ములను మంచిగ చూసుకొంటున్నరు. ఇంతకముందు ఏ గవుర్నమెంటూ మమ్మల్ని పట్టించుకోలె. గిప్పుడు రెవెన్యూ చట్టంతో మరింత మేలు చేసిండు. మాకు కేసీఆర్‌ సారు దేవుడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.

- సమ్మయ్య, రైతు, అన్నారం, కోటపల్లి మండలం 

ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది..

ఇంతకముందు ఏ రెవెన్యూ పని ఉన్నా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. కొత్త రెవెన్యూ చట్టంతో ఆ తిప్పలు తప్పినయ్‌. అందుకే సారుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘీభావంగా ర్యాలీ తీసినం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల గురించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. కేసీఆర్‌ లెక్క రైతులను అర్సుకున్న ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా సూడలె. రైతులకు మంచి చేసిన నాయకుడు ఆయన ఒక్కరే.      - మోడెం గట్టాగౌడ్‌, రైతు, ఎక్స్‌ ఎంపీపీ, కోటపల్లి 

పేదల పక్షపాతి

చెన్నూర్‌ టౌన్‌: సీఎం కేసీఆర్‌ సారు రైతుల పక్షపాతి. పేదల కోసం అనేక మంచి పథకాలు తీసుకొచ్చిండు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలతో పాటు పింఛన్లతో పేదలను ఆదుకుంటున్నడు. పెట్టుబడి కోసం రైతులకు రైతు బంధు పేరిట సాయం చేస్తున్నడు. రైతు బీమాతో చాలా కుటుంబాలకు సాయం చేసిండు. పేదలు, రైతులు ఇబ్బందులు పడద్దనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిండు. ఆయన చేసిన మేలు ఎవ్వరూ మరిచిపోరు..

- పెద్దింటి పున్నంచంద్‌, ఉప సర్పంచ్‌, మండల సమన్వయ కర్త, సిర్సా, కోటపల్లి 

పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ..

 మా అసోంటి పేదల గురించి ఈ టీఆర్‌ఎస్‌ గవుర్నమెంట్‌ మాత్రమే పట్టించుకుంటున్నది. ఇంతకముందు ఎవలూ పట్టించుకున్న పాపాన పోలేదు. భూమి తగాదా ఉన్నదని రెవెన్యూ ఆఫీసుకు పోతే రేపూ మాపూ అంటూ కాళ్లరిగేట్లు తిప్పించుకున్నరు. వచ్చి పోయేందుకు పైసలు ఒడిసేటివి. కొత్త చట్టంతో కేసీఆర్‌ సారు మంచి పని చేసిండు. పైసలు ఇచ్చే పనితప్పింది. రైతుబంధు, రైతుబీమాతోని సుత మాకు    మంచి సేత్తున్నరు.                - భైసా ప్రభాకర్‌, రైతు, కోటపల్లి