బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Sep 23, 2020 , 01:56:40

కార్మికులకు అండగా టీబీజీకేఎస్‌

కార్మికులకు అండగా టీబీజీకేఎస్‌

  •  టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌) :  కార్మికులకు  అం డగా ఉంటామని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌ అన్నారు. శ్రీరాంపూర్‌ ఆర్కే 6 గనిపై ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవా రం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల హ కులు పోగొట్టిన జాతీయ కార్మిక సంఘాలకు టీబీజీకేఎస్‌ను ప్రశ్నించే హక్కు లేదన్నారు. కార్మికులకు కొత్త హక్కులు సాధించి పెట్టామని, దీంతో కార్మికులు టీబీజీకేఎస్‌, సీఎం కేసీఆర్‌పై విశ్వాసం వ్యక్తం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు. సీఎం ఇచ్చిన హామీలు 99 శాతం పరిష్కరించామన్నారు. టీబీజీకేఎస్‌ కేంద్ర చర్చల ప్రతినిధి వీరభద్రయ్య, రీజియన్‌ కార్యదర్శి మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెం గళ కుమారస్వామి, రాజనాల రమేశ్‌, పెట్టం లక్ష ణ్‌, పోశెట్టి, బ్రాంచ్‌ కార్యదర్శి పానగంటి సత్త య్య, పిట్‌ కార్యదర్శి చిలుముల రాయమల్లు, నా యకులు ముక్కెర రమేశ్‌, వెంకటరాజం, ప్రవీణ్‌, కేతిరెడ్డి భరత్‌రెడ్డి, పొగాకు రమేశ్‌ పాల్గొన్నారు. logo