బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Sep 23, 2020 , 01:56:40

అన్ని వార్డుల్లో ఫాగింగ్‌ చేయాలి

అన్ని వార్డుల్లో ఫాగింగ్‌ చేయాలి

  • మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు

సీసీసీ నస్పూర్‌ : అన్ని వార్డుల్లో ఫాగింగ్‌ చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీలో రూ. లక్షా 60 వేలతో కొనుగోలు చేసిన 2 ఫాగింగ్‌ మిషన్లను గోదావరికాలనీ షిర్కె, సుందరయ్యకాలనీలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వా ర్డుల్లోని డ్రైనేజీలు, నీరు నిలిచిన ప్రాంతాల్లో ఫా గింగ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కమిషనర్‌ రాధాకిషన్‌, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వంగ తి రుపతి, కౌన్సిలర్లు బండి పద్మ, కుర్మిళ్ల అన్నపూర్ణ, పంబాల గంగా, పూదరి కుమార్‌, మర్రి మొగిళి, జబీన్‌హైమద్‌, కోఆప్షన్‌ సభ్యులు ముత్తె రాజేశం, నాసర్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకూనూరి సంపత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. logo