శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Sep 22, 2020 , 02:14:44

అభివృద్ధిపైనే దృష్టి

అభివృద్ధిపైనే దృష్టి

మంచిర్యాల టౌన్‌: అభివృద్ధి, సంక్షేమంపైనే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్నదని  మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.   పట్టణంలోని 16వ వార్డు అశోక్‌రోడ్‌, సున్నంబట్టి వా డ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పథకం కింద ఏర్పాటు చేయనున్న పైపులైన్‌ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్ర భుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక  పథకాలను ప్రవేశ పెట్టి ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా చూస్తున్నదన్నారు. మంచిర్యాల పట్టణంలో అన్ని ప్రాంతాలకు తాగునీరందించేందుకు 158 కిలోమీటర్ల మేర పైపులైన్‌ను విస్తరించనున్నామని చెప్పారు. పట్ట ణంలో మూడు నూతన ట్యాంకులను నిర్మిస్తున్నామ ని, ఇందుకు రూ. 58 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ గౌడ్‌, మాజీ చైర్‌ పర్సన్‌ మామిడిశెట్టి వసుంధర, కౌన్సిలర్లు బోరిగం శ్రీనివాస్‌, గా దెసత్యం, హరిక్రిష్ణ, పూదరి సునీత, హఫీజాబేగం, కోఆప్షన్‌ సభ్యుడు మామిడిశెట్టి రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గడప రాకేశ్‌, చంద్రశేఖర్‌ హండే, పల్లపు తిరుపతి, కొండాల్‌రావు, బల్జపెల్లి సత్యనారాయణ, నగేశ్‌, గౌసోద్దీన్‌, తాజుద్దీన్‌ పాల్గొన్నారు. 


logo