గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Sep 22, 2020 , 02:14:44

సంక్షేమమే ధ్యేయం

సంక్షేమమే ధ్యేయం

  • అన్ని వర్గాలకు మేలు చేకూరేలా పథకాలు
  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

మందమర్రి: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. పట్టణంలోని శాంతినగర్‌ దుబ్బగూడెంలో నేతకాని వెల్ఫేర్‌ సొసైటీ నా యకులు, సభ్యులతోపాటు 50 మంది యు వకులు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వా రికి బాల్క సుమన్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పథకాలను రూపొందిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన చూసి ప్రజలు పా ర్టీని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. నేతకాని వెల్ఫేర్‌ సొసైటీ నాయకులు, సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. తమ కాలనీలో డ్రైనేజీతోపాటు మౌలిక వసతులు కల్పించాలని,    తమ సొసైటీకి సొంత భవనం మంజూరు చే యాలని కోరగా ఆయన సానుకూలంగా స్పం దించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో నేతకా ని సొసైటీ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు గొల్లపల్లి దుర్గయ్య, దుర్గం కిరణ్‌, రావుల శేఖ ర్‌, రత్నం రవి, రావుల రామకృష్ణ, కిరణ్‌, రాజు, శేఖర్‌ తదితరులున్నారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు రవీందర్‌, మేడిపల్లి సంపత్‌, ఓరుగొండ రాజశేఖర్‌, కొంగల తిరుపతి రెడ్డి, ఎండీ అబ్బాస్‌, బర్ల సదానందం, బత్తుల శ్రీనివాస్‌, తోట సురేందర్‌, కొంగల శ్రీనివాస్‌రెడ్డి, వైద్యం ప్రసాద్‌, రామకృష్ణ, మాసు వెంకటేశ్‌, మహిళా నాయకురాళ్లు శారద, సుగుణ పాల్గొన్నారు. 

రైతు వేదికలు పూర్తి చేయండి

జైపూర్‌: రైతు వేదికల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సూచించారు. మండల కేంద్రంలో నిర్మాణ ప నులను ఆయన పరిశీలించి మార్పులు చేర్పులను అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. జడ్పీటీసీ మేడి సు నీత, ఎంపీపీ గోదారి రమాదేవి, సర్పంచ్‌ సు వర్ణ, ఎంపీటీసీ లింగస్వామి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అరవిందరావు, సీనియర్‌ నాయకులు రిక్కుల మధూకర్‌ రెడ్డి, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, మేడి తిరుపతి, గోదారి లక్ష్మణ్‌, రైతు బంధు సమితి కన్వీనర్‌ తిరుపతిరెడ్డి, తదిత రులు ఉన్నారు. 


logo