శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Sep 22, 2020 , 02:14:45

దసరాలోగా లాభాల వాటా

దసరాలోగా లాభాల వాటా

  • n కారుణ్య ఉద్యోగాలు మాతోనే సాధ్యం   
  • n టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌
  • n 2400 మంది బదిలీ వర్కర్లకు జనరల్‌ మజ్దూర్లుగా ఉద్యోగోన్నతులు

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): దసరాలోగా సింగరేణి లాభా ల వాటాను చెల్లించేలా కృషి చేస్తామని గుర్తిం పు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌ కార్మికులకు హామీ ఇచ్చారు. శ్రీ రాంపూర్‌ ఎస్‌ఆర్పీ-3పై ఉపాధ్యక్షుడు సురేం దర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  సోమవారం పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో అమలైన డిపెండెంట్‌ ఉద్యోగాలు జాతీయ కార్మిక సంఘాలు సం తకాలు చేసి పోగొట్టాయని, సీఎం కేసీఆర్‌ కా రుణ్య ఉద్యోగాలిచ్చి కార్మికులకు న్యాయం చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించారని చెప్పారు. బీజేపీ కార్మిక, పా రిశ్రామిక వ్యతిరేక విధానాలతో సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించలేకపోతున్నామని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్య లు పరిష్కరిస్తుంటే జాతీయ సంఘాలు ఓర్వలేక టీబీజీకేఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 28న సింగరేణి బోర్డు సమావేశం ఉందని, సంస్థ లాభాలు ప్ర కటించగానే కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తమ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసి లాభాల వాటా సాధించి పెడతామని, దసరాలోగా చెల్లింపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నెలలోగా మార్చి నెల సగం వేతనం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నా రు. కొవిడ్‌-19 సోకిన కార్మికులకు కార్పొరేట్‌  వైద్యం అందించేందుకు 150 పడకలతో కా ర్పొరేట్‌ దవాఖానలతో ఒప్పందం చేసుకున్న ట్లు చెప్పారు. యాజమాన్యం 35 వేల కరోనా పరీక్షల కిట్లు తీసుకున్నదన్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించిందన్నారు. కార్మికులు జాతీయ సంఘాల తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు. 

2400 కార్మికులకు ఉద్యోగోన్నతి

సంస్థ వ్యాప్తంగా 2400 మంది బదిలీ కార్మికులకు జనరల్‌ మజ్దూర్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నామని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంఫూర్‌ ప్రెస్స్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. మార్చిలోగా 1200 మంది కార్మికులకు జనరల్‌ మజ్దూర్‌ ఉద్యోగోన్నతులు కల్పించేందుకు యాజమాన్యంతో ఒప్పందం జరిగిందని చెప్పారు. 13 నెలల్లోనే ఉద్యోగోన్నతి, 80 మంది డిస్మిస్డ్‌ కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఇప్పటి వర కు సింగరేణి వ్యాప్తంగా 6వేల మంది కార్మికు ల పిల్లలకు ఉద్యోగాలు లభించాయని చెప్పా రు. నెలలోగా మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని, ప్రభుత్వం కూడా యాజమాన్యాని కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. గుర్తిం పు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్మికులు కేసీఆర్‌కు, టీబీజీకేఎస్‌ కృతజ్ఞతగా ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రీజియ న్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి, స్వామి, రాజనాల రమేశ్‌, అశోక్‌ పాల్గొన్నారు.  

150 మంది బదిలీ వర్కర్ల చేరిక

శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్పీ-3గనికి చెం దిన 150 మంది కారుణ్య బదిలీ వర్కర్లు, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, ఏఐటీయూసీల నా యకులు, కార్యకర్తలు టీబీజీకేఎస్‌లో చేరగా అధ్యక్షుడు వెంకట్రావ్‌ కండువా కప్పి స్వాగ తం పలికారు. పిట్‌ కార్యదర్శి గోపాల్‌రెడ్డి ఆ ధ్వర్యంలో బదిలీ వర్కర్లు చంద్రమోహన్‌, దేవరకొండ శ్యామ్‌, సతీశ్‌, రాచకొండ శ్రీనివా స్‌, కోన శ్రీనివాస్‌ 150 మంది టీబీజీకేఎస్‌లో చేరారు. టీబీజీకేఎస్‌ డిప్యూటీ ప్రధాన కార్యద ర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి  వీరభద్రయ్య, రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారె డ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కు మారస్వామి, రాజనాల రమేశ్‌, పెట్టం లక్షణ్‌, అశోక్‌, నాయకులు వీరమల్లు, చేరాలు, భాస్క ర్‌, రాజిరెడ్డి, శ్రావణ్‌, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


logo