సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Sep 21, 2020 , 01:02:32

ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు: ఎంపీ వెంకటేశ్‌నేతకాని

ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు: ఎంపీ వెంకటేశ్‌నేతకాని

మంచిర్యాలటౌన్‌ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని 32వ వార్డు రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కూడా నీటి కోసం బిందెతో బయటకు రావద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని రూపొందించారన్నారు. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పథకం కింద రూ.58 కోట్లతో మంచిర్యాల పట్టణంలో 158 కిలోమీటర్ల మేర పైపులైన్లను విస్తరించనున్నామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు, వార్డు కౌన్సిలర్‌ గాదె సత్యం, కౌన్సిలర్లు హరికృష్ణ, మహేశ్వరి, వేములపల్లి సంజీవ్‌, బానేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బొలిశెట్టి విజయ్‌, చంద్రశేఖర్‌ హండే, కొండాల్‌రావు, జగన్‌, గడప రాకేశ్‌, కార్కూరి చంద్రమౌళి, రవీందర్‌రావు, బింగి రమేశ్‌, శ్రీపతి రవి, అప్పాసు కిషన్‌, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

రైతు వేదిక పనుల పరిశీలన..

దండేపల్లి : మేదరిపేటలో రైతు వేదిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ లింగన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కే లింగన్న నాయకులు పాల్గొన్నారు. 


logo