సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Sep 20, 2020 , 03:00:22

ఆదివాసులకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఆదివాసులకు నిత్యావసర సరుకుల పంపిణీ

కాసిపేట : మండలంలోని ఆయా గ్రా మాల్లోని 73 ఆదివాసీ కొలాం కుటుంబాలకు గూంజ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు నిత్యావసర సరుకులను పం పిణీ చేశారు. పావుగూడలో 27 కుటుంబాలకు, బక్కుగూడలో 17, జెండాగూడలో 20, తిరుమలాపూర్‌లో 9 కుటుంబాలకు వేర్వేరుగా గ్రామాల్లో నిత్యావసర సరుకులు, మాస్క్‌లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇం దులో గూంజ్‌ సేవా సంస్థ సభ్యులు మడావి శంకర్‌, గొడప గోవింద రాజు, కృష్ణ, శ్రీనివాస్‌, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మడావి అనంతరావు, సర్పంచ్‌లు ఆడె జంగు, కవిత, పెంద్రం హన్మం తు, మాజీ సర్పంచ్‌ మడావి వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.  

సామగ్రి అందజేత

తాండూర్‌ : మండలంలోని సేవాజ్యోతి శరణాలయానికి యూత్‌ ఫర్‌ సేవా ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఈఏ అనే కార్పొరేట్‌ కంపెనీ వారు అల్మారాలు, బుక్స్‌ ర్యాక్స్‌, టేబుల్స్‌, కుర్చీలు ఐదు రకాల వస్తు సామగ్రిని కో ఆర్డినేటర్‌ తోట శ్రీనివాస్‌ శనివారం అందించారు. వలంటీర్లు శ్రావణ్‌రాజ్‌, శ్రావణ్‌, వెంకటేశ్‌, సేవాజ్యోతి నిర్వాహకులు గజ్జెల్లి శ్రీదేవి మల్లేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo