ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Sep 20, 2020 , 03:00:25

మౌలిక వసతుల కల్పనకు కృషి

మౌలిక వసతుల కల్పనకు కృషి

  •  మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు    n  మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు ప్రారంభం 

మంచిర్యాల టౌన్‌ : మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నా రు. పట్టణంలోని ఏసీసీ శ్రీనివాస కాలనీ, జాఫర్‌ నగర్‌, ఇస్లాంపూర్‌, రాళ్లపేట ఏరియా ల్లో  మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను శనివారం ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరునెలల్లో అన్ని ప్రాంతాలకు పైపులై న్లు వేసి ప్రజలకు తాగునీరు అందిస్తామన్నా రు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రా జయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్యరెడ్డి, గాదెసత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రశేఖర్‌ హండే, బుద్ధార్థి రాంచందర్‌, కార్కూరి చంద్రమౌళి, తూముల నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఫాగింగ్‌ యంత్రాల ప్రారంభం

పట్టణంలో దోమల నివారణకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ. 1.30 లక్షలతో కొనుగోలు చేసిన రెండు ఫాగింగ్‌ యంత్రాలను శనివా రం ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అన్ని వార్డుల్లో ఫాగింగ్‌ చేస్తామన్నారు.


logo