బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Sep 19, 2020 , 02:20:46

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

దహెగాం : మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం పీపీరావు ప్రాజెక్ట్‌లో లక్షా అరవై వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌లు, చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేపల పెంపకం చేపట్టడంతో వేలాది మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నారన్నారు. జిల్లాలో కుమ్రం భీం ప్రాజెక్ట్‌, వట్టివాగు ప్రాజెక్ట్‌, ఎన్‌టీఆర్‌ ప్రాజెక్ట్‌, పీపీ రావు ప్రాజెక్ట్‌లతో పాటు, 10 పెద్ద చెరువుల్లో 71 లక్షల చేప పిల్లలను వదలడంతో పాటు, మరో 242 చిన్నతరహా చెరువుల్లో 61లక్షల చేప పిల్లల్ని వదిలి పెట్టనున్నట్లు తెలిపారు. అధికారులు చేపల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి సాంబశివరావు, ఎంపీపీ సులోచన, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సంతోష్‌ గౌడ్‌, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్‌లు బండ కృష్ణ, రాజయ్య, నాయకులు ప్రసాద్‌రాజ్‌,అల్గం మల్లేశ్‌, మధూకర్‌, బాలు, సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి

 పేదింటి ఆడబిడలకు కల్యాణలక్ష్మి వరమని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 63 మం ది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించడంతో పాటు ఇద్దరికి రైతుబీమా, మరో ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డ ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే  ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ద్వారా అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే సులోచన, డీటీ బక్కయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కే సంతోష్‌ గౌడ్‌, వైస్‌ ఎంపీపీ చౌదరి సురేశ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు హైమద్‌, సర్పంచ్‌లు పుప్పాల లక్ష్మి, కృష్ణ, జయేందర్‌, ఆయిల్ల శంకర్‌, ఎంపీటీసీలు జయలక్ష్మి, రాకేశ్‌, ఆర్‌ఐ మోహన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ప్రసాద్‌రాజ్‌, నాయకులు దందెర వెంకన్న, పీ సంతోస్‌, తుమ్మిడ పాపయ్య, మధూకర్‌, రౌతు రాజన్న, పీ భీమన్న, సోను, తదితరులు పాల్గొన్నారు.      

ఎనిమిది మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కాగజ్‌నగర్‌ రూరల్‌ : పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయమ ని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పేర్కొన్నారు. మండ లానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు  సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.2 లక్షల 87వేల 500ల చెక్కులు మంజూరయ్యాయి. కా గా, శుక్ర వారం చెక్కులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివా సంలో అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు మెహబూబ్‌, నాయకులు వనమాల రాము, నాగేందర్‌, పూర్ణచందర్‌ రావు ఉన్నారు.logo