గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Sep 18, 2020 , 01:25:00

పనుల్లో వేగం పెంచాలి

పనుల్లో వేగం పెంచాలి

  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి 

చెన్నూర్‌ రూరల్‌ : అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. మండలంలోని ఆస్నాద్‌ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణాన్ని ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు షిఫ్టుల్లో పనులు నిర్వహిస్తేనే నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని సూచించారు. వీటితో పాటు వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం పనులు కూడా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే దసరా నాటికి రైతు వేదికలు అందుబాటులో ఉండాలని అధికారులతో పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీవో బీరయ్య, ఏపీవో గంగాభవాని, ఏఈవో సాగర్‌, నాయకుడు వెంకటేశ్వర్‌ రావు ఉన్నారు. 


logo