మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Mancherial - Sep 16, 2020 , 03:10:21

పనులు వేగవంతం చేయాలి

 పనులు వేగవంతం చేయాలి

  • n  ఎంపీడీవో సీహెచ్‌ రాధిక 
  • n  రైతు వేదిక నిర్మాణాల పరిశీలన

బోథ్‌: రైతు వేదిక పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవో సీహెచ్‌ రాధిక సూచించారు. మండలంలోని బాబెర గ్రామం లో ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రెడ్డితో కలిసి మంగళవారం నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల రోజుల్లోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నా రు. 7 క్లస్టర్లలో రూ 22 లక్షల చొప్పున నిధులతో వేదికల ప నులు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం మర్లపల్లిలో విలేజ్‌ పార్కు పనులు పరిశీలించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్‌, ఇస్రు ఉన్నారు.  

బేల: నెలాఖరులోగా రైతు వేదిక పనులు పూర్తి చేయాలని మం డల ప్రత్యేకాధికారి ఈడీ శంకరయ్య అన్నారు. మండలంలోని దౌన, దుబ్బగూడ, సైద్‌పూర్‌ తదితర గ్రామాల్లో మంగళవారం ప్రకృతి వనాలతో పాటు రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనాల  ఏర్పాటుతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొం టుందన్నారు. అదేవిధంగా డంప్‌యార్డులు, శ్మశాన వాటిక ప నులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో రవీందర్‌, సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉన్నారు.


logo