శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Sep 14, 2020 , 02:24:53

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

బెల్లంపల్లిటౌన్‌: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ  ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో భూ వివాదాలు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ రాణి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ ఎం శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గడ్డం భీమాగౌడ్‌, కోలి వేణుమాధవ్‌, కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, సర్పంచ్‌ వేముల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి

బెల్లంపల్లిటౌన్‌: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ వరంలాంటిదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 137 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజశేఖర్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 

పరామర్శ

తాండూర్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద ఈ నెల 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాండూర్‌ సర్పంచ్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండు అంజిబాబు ద్వాదశ దినకర్మ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంజిబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గణేశ్‌ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. జడ్పీటీసీ బాణయ్య, ఎంపీపీ పూసాల ప్ర ణయ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సత్యనారాయణ,  ప్ర జాప్రతినిధులు, సర్పంచ్‌లు నివాళులర్పించారు. logo