గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Sep 14, 2020 , 02:19:22

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు

హాజీపూర్‌ : మంచిర్యాల జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ భారతీ హోళికేరి,అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి కొవిడ్‌-19 నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34, 773 మందికి కొవిడ్‌ 19 టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. ఐసొలేషన్‌ కేంద్రాల్లో పూర్తి మౌలిక వసతులు కల్పిం చినట్లు పేర్కొన్నారు. సరిపడా బెడ్లు, అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తాళ్లగురిజాలలోని కేంద్రాన్ని మంచిర్యాల డిగ్రీ కళాశాలలోకి మార్చాలని సూచించారు. ఆర్కేపీ, మంద మర్రి, చెన్నూర్‌ తదితర ప్రాంతాల్లో త్వరలో రక్తదాన శిబిరాల ను ఏర్పాటు చేసి రక్త నిల్వలను సేకరిస్తామన్నారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా దూరమవుతుందన్నారు.  కలెక్టర్‌ భారతీ హోళికేరి మాట్లాడుతూ హోం ఐసొలేషన్‌లో ఉన్నవారి పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ, సరిపడా మందులు అందజేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలపై మాట్లాడారు. ఈజీఎస్‌ ద్వారా జాబ్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో పనుల లభ్యత పై జా బితా తయారు చేసుకోవాలని సూచించారు. మండలాభివృద్ధి అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి నీరజ, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ అరవింద్‌, జిల్లా సర్వైవ్‌ లెన్స్‌ అధికారి బాలాజీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.logo